తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో ఒటమి తర్వాత చంద్రబాబు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించడం ఇదే మెుదటిసారి. పార్టీ బలోపేతం చేసే దిశగా బాబు పర్యటనలు కొనసాగనున్నాయి. సోమవారం నెల్లూరు జిల్లాలకు రానున్న చంద్రబాబు జిల్లా కేంద్రంలో జిల్లా స్ధాయి పార్టీ నేతల విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొంటారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో ఒటమి తర్వాత చంద్రబాబు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించడం ఇదే మెుదటిసారి. పార్టీ బలోపేతం చేసే దిశగా బాబు పర్యటనలు కొనసాగనున్నాయి. సోమవారం నెల్లూరు జిల్లాలకు రానున్న చంద్రబాబు జిల్లా కేంద్రంలో జిల్లా స్ధాయి పార్టీ నేతల విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయటం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే ధ్యేయంగా ఆయన సమావేశాలు నిర్వహిస్తారని ఆ పార్టీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తెదేపా అధినేత తొలిసారి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని సోమిరెడ్డి తెలిపారు.సోమవారం ఉదయం 11గంటలకు చంద్రబాబు పట్టణంలోని అనిల్ గార్డెన్స్‌కు చేరుకున్నార. అక్కడ పార్టీ జిల్లా సర్వసభ్యసమావేశం అనంతరం మధ్యాహ్నం నుంచి ఆరు నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తారు.
జిల్లాలో వైకాపా అనుసరిస్తోన్న విధానాలపై 15వ తేదీన చర్చిస్తారు. తెదేపా కార్యకర్తలపై జరుగుతోన్న దాడులు, బాధితులతో మాట్లాడతారు. అనంతరం మిగిలిన నాలుగు నియోజకవర్గాల నేతలు సమీక్షల్లో పాల్గొంటారు. ఈ నెలలో ఆయనకిది రెండో జిల్లా పర్యటన. ఇప్పటికే 10, 11 తేదీల్లో విశాఖపట్నం జిల్లా పర్యటించారు. తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నేతలు,కార్యకర్తలతో ఆయనవిస్తృతంగా సమాలోచనలో జరుపుతారు. ఓటమితో నిస్తేజంలో పార్టీని శ్రేణిలో ఆయన ఉత్తేజం నింపనున్నారు.