తెలుగు గంగ డిప్యూటీ కలెక్టర్ నరసింహులు ఇంట్లో ఏసీబీ సోదాలు

By narsimha lodeFirst Published Oct 10, 2019, 11:19 AM IST
Highlights

అవినీతి అధికారులపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించింది.

నెల్లూరు: తెలుగు గంగ డిప్యూటీ కలెక్టర్  నరసింహులు  ఇంటిపై గురువారం నాడు  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి నరసింహులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు.

నరసింహులు పెద్ద ఎత్తున ఆస్తులను కలిగి ఉన్నట్టుగా  ఏసీబీ అధికారులు చెబుతున్నారు. నెల్లూరులోని  నరసింహులు ఇంటితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. 

నరసింహులు ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో కూడ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ సోదాల్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్టుగా  ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఇంకా పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నట్టుగా ఏసీబీ  ప్రకటించింది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న  ఉద్యోగులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కీలకమైన ఉద్యోగులను ఏసీబీ అధికారలు అరెస్ట్ చేశారు. ఏపీ రాష్ట్రంలో కూడ ఇదే ప్రక్రియ కొనసాగుతోంది.

click me!