దారుణం : మొదటి భార్య కూతురుతో.. రెండో భార్య కొడుకు ప్రేమాయణం.. మందలించారని...

Published : Jan 26, 2022, 10:04 AM IST
దారుణం : మొదటి భార్య కూతురుతో.. రెండో భార్య కొడుకు ప్రేమాయణం.. మందలించారని...

సారాంశం

మొదటి wife నాలుగో కూతురు (16), రెండో భార్య పదహారేళ్ల కొడుకు మధ్య love affair మొదలయ్యింది. ఇది కుటుంబసభ్యులకు తెలిసింది. ఈ విషయాన్ని ముందు జీర్ణించుకోలేకపోయారు. ఆ తరువాత పిల్లలిద్దరినీ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి క్రిష్ణగిరి మహిళా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

కర్ణాటక : వావి వరుసలు మరిచి ప్రేమ, పెళ్లి అంటూ తెగబడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలాంటి ఓ ఘటన karnatakaలో వెలుగుచూసింది. వరుసకు brother అయ్యే బాలునితో ప్రేమవద్దని మందలించగా బాలిక suicide చేసుకున్న ఘటన కర్నాటకలో జరిగింది. క్రిష్ణగిరి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కార్మికుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు నలుగురు పిల్లలు, రెండు భార్యకు ఇద్దరు పిల్లలున్నారు. అంతా ఒక దగ్గరే ఉంటున్నారు. 

ఈ క్రమంలో మొదటి wife నాలుగో కూతురు (16), రెండో భార్య పదహారేళ్ల కొడుకు మధ్య love affair మొదలయ్యింది. ఇది కుటుంబసభ్యులకు తెలిసింది. ఈ విషయాన్ని ముందు జీర్ణించుకోలేకపోయారు. ఆ తరువాత పిల్లలిద్దరినీ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి క్రిష్ణగిరి మహిళా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి.. సొంత అన్నతో సొంత చెల్లెలు అక్రమ సంబంధం పెట్టుకున్న ఘటన గతంలో ఉత్తరప్రదేశ్ లోనూ వెలుగులోకి వచ్చాయి. కనీసం వావి వరసలు కూడా పాటించకుండా నీచంగా ప్రవర్తించింది. అక్కడితో ఆగలేదు.. తమ కామక్రీడకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతనిని అంతమొందించింది.

ఆగ్రా పరిధిలోని ఖండా గ్రామానికి చెందిన విక్రమ్ ఠాకూర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రవీనా అలియాస్ రాణి, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చిలో.. భార్యాపిల్లలతో సహా విక్రమ్ స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో అతని ఇంటికి పక్కనే రవీనా అన్న ప్రతాప్ నివాసం ఉంటున్నాడు.

సొంత అన్నా చెల్లెల్లు అయిన రవీనా, ప్రతాప్ లు ఎవరికీ తెలీకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం భర్తకు తెలిసిపోతుందేమో అని భయపడ్డారు. అతని అడ్డు తొలగించుకుంటే తాము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని భావించారు. ఈ క్రమంలోనే నిద్రపోతున్న విక్రమ్ గొంతు కోసి హత్య చేశారు. అనంతరం రవీనా తనకు ఏమీ తెలీనట్లు.. ఎవరో తన భర్తను హత్య చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది.

అయితే.. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. రవీనా, ప్రతాప్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇదిలా ఉండగా,  సమాజంలో ఆదర్శంగా ఉండి, మంచి పౌరులను తీర్చి దిద్దాల్సిన teachers వక్రమార్గం పడుతున్నారు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన students పాలిట కీచకుల్లా మారి నీచంగా ప్రవర్తిస్తున్నారు. బెదిరించి, భయపెట్టి చిన్నారులను లొంగదీసుకుంటూ.. వారిపై అకృత్యాలకు పాల్పడుతూ school పవిత్రతతను దెబ్బతీస్తున్నారు. అలా పవిత్రమైన గురువు వృత్తిలో ఉండి, ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న head master నీచ ఉదంతం ఒకటి బయటపడింది. 

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం Mysore District హెచ్ డీ కోటె తాలూకాలో వెలుగు చూసింది. విద్యార్థినితో రాసలీలలు చేస్తున్న వీడియోలు WhatsAppలో సర్కిల్ కావడంతో ఆ హెచ్ఎం మీద ప్రజలు భగ్గుమంటున్నారు. మైసూరు వ్యాప్తంగా ఆ వీడియోలు viral కావడంతో బాలిక కుటుంబం తలెత్తుకోలేకపోతోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి స్పందించారు. త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని, వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu