తన కడుపులో బిడ్డ కోసం... తోటి కోడలి కొడుకును బలి ఇచ్చిన మహిళ..!

Published : Aug 26, 2022, 11:07 AM IST
తన కడుపులో బిడ్డ కోసం... తోటి కోడలి కొడుకును బలి ఇచ్చిన మహిళ..!

సారాంశం

ఈ సారి కూడా పిల్లలు పుట్టి చనిపోతారేమో అనే భయంతో ఓ తాంత్రికుడిని కలిసింది. ఎవరినైనా బలిదానం ఇస్తే.. మీ బిడ్డకు ఏమీ కాదని ఆ తాంత్రికుడు చెప్పడంతో.. రమేష్ రెండో కుమారుడు 18 నెలల బాలుడిని నరబలి ఇచ్చారు.  

ఓ మహిళ తన కడుపులో బిడ్డ కోసం..18 నెలల బాలుడిని బలి ఇచ్చింది. తన కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని.. అందుకోసం.. మరో బిడ్డను 18 నెలల బిడ్డను దారుణంగా బలిదానం ఇచ్చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం  లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి  వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహ జిల్లా మలక్ పూర్ గ్రామ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. చనిపోయిన బాలుడు తండ్రి రమేష్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం..... రమేష్ కుమార్ అన్నయ్య(35), వదిన సరోజ్ దేవి (32)లకు సంతానం లేరు. మూడు సార్లు పిల్లలు పుట్టినట్లే పుట్టి చనిపోయారు. ఇటీవల ఆమె నాలుగో సారి గర్భం దాల్చింది. ఈ సారి కూడా పిల్లలు పుట్టి చనిపోతారేమో అనే భయంతో ఓ తాంత్రికుడిని కలిసింది. ఎవరినైనా బలిదానం ఇస్తే.. మీ బిడ్డకు ఏమీ కాదని ఆ తాంత్రికుడు చెప్పడంతో.. రమేష్ రెండో కుమారుడు 18 నెలల బాలుడిని నరబలి ఇచ్చారు.

అనంతరం బాలుడి మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. చెరకు తోటలో పడేశారు. కాగా... బాధితుడు రమేష్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !