పనిమీద బయటకెళ్లిన భర్త.. ఇంటికొచ్చి చూసేసరికి

Siva Kodati |  
Published : Jan 24, 2021, 04:30 PM IST
పనిమీద బయటకెళ్లిన భర్త.. ఇంటికొచ్చి చూసేసరికి

సారాంశం

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. డబ్బు, నగల కోసం ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా మహిళ గొంతుకోసి మెడలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు దుండగులు.

వివరాల్లోకి వెళితే... ఒరిస్సా రాష్ట్రం రాయగడ జిల్లా కుభికొట పంచాయతీ పరిధి హులకాతుండ గ్రామానికి చెందిన బిజయ్‌ హులుకా భార్య కొసాయి హులుకా (29). ఈ క్రమంలో బిజయ్‌ తన సొంత పనిమీద శుక్రవారం రాయగడకు వెళ్లాడు.

ఆయన పని ముగించుకొని తిరిగి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి చూడగా భార్య రక్తపు మడుగులో పడి వుండటాన్ని గమనించి కేకలు వేశాడు.

చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూసేసరికి మృతురాలి గొంతు కోసి ఉండటం గమనించారు. అయితే ఆమె ధరించిన బంగారు ఆభరణాలు కనిపించకపోగా.. ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరిచి ఉన్నాయి.

దోపిడి దొంగల పనిగా భావించిన స్థానికులు వెంటనే కుంభికోట పొలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu