ఇడ్లీ తినలేదని.. చిన్నారిని చంపేసిన మహిళ

Published : Sep 10, 2020, 02:58 PM IST
ఇడ్లీ తినలేదని.. చిన్నారిని చంపేసిన మహిళ

సారాంశం

ఆరోగ్యమేరీకి ఇంకా వివాహం కాలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రెన్సీమేరీని ఇడ్లీ తినమని ఆరోగ్యమేరీ కోరగా, అవి బాగా లేవు, నాకు వద్దంటూ బాలిక బయటకు వెళ్లి స్నేహితులతో ఆడుకోసాగింది.

ఇడ్లీ తనకు నచ్చలేదని చెప్పి తినలేదని ఓ చిన్నారిని మహిళ అతి దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  తమిళనాడు రాష్ట్రం కుళ్లకురిచ్చి జిల్లా త్యాగ దుర్గం సమీపం మెల్ విళి గ్రామానికి చెందిన రోసారియా, జయరాణి దంపతులకు రెన్సీమేరీ(5) అనే కుమార్తె ఉంది.

మూడేళ్ల క్రితం జయరాణి అనారోగ్యంతో మృతి చెందింది. అయితే.. రోసారియో మరో మహిళను వివాహం చేసుకొని వేరుగా ఉండడంతో, బాలిక రెన్సీమేరీ జయరాణి తల్లి పచ్చయమ్మాళ్‌ ఇంట్లో ఉంటుంది. 

అక్కడ జయరాణి అక్క ఆరోగ్యమేరీ కూడా ఉంటుంది. ఆరోగ్యమేరీకి ఇంకా వివాహం కాలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రెన్సీమేరీని ఇడ్లీ తినమని ఆరోగ్యమేరీ కోరగా, అవి బాగా లేవు, నాకు వద్దంటూ బాలిక బయటకు వెళ్లి స్నేహితులతో ఆడుకోసాగింది.

దీంతో ఆగ్రహించిన ఆరోగ్యమేరీ స్నేహితులతో ఆడుకుంటున్న రెన్సీమేరీని చావబాదుతూ ఇంట్లోకి తీసుకొచ్చి, తలుపులు మూసి కర్రతో తీవ్రంగా కొట్టినట్టు సమాచారం. బాలిక కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని రెన్సీమేరీని రక్షించి త్యాగదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

అక్కడ ప్రథమ చికిత్సల అనంతరం బాలికను కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే బాలిక మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై త్యాగదుర్గం పోలీసులు కేసు నమోదుచేసి ఆరోగ్యమేరీని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

PREV
click me!

Recommended Stories

తమిళనాడు బడ్జెట్ విజయ్ ఆసక్తికర కేటాయింపులు | Tamil Nadu CM Vijay Mega Budget 2026
వెనకా, ముందు ఎస్కార్ట్ రైళ్లు.. మధ్యలో రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు. ఇదొక న‌డిచే రాజ‌భ‌వ‌నం