కన్న కూతురిపై ఏడాదిగా సామూహిక అత్యాచారం.. కన్నతల్లే దగ్గరుండి...

Published : Dec 09, 2019, 12:51 PM IST
కన్న కూతురిపై ఏడాదిగా సామూహిక అత్యాచారం.. కన్నతల్లే దగ్గరుండి...

సారాంశం

 గుజరాత్ రాష్ట్రం పాలిటానా తాలుకా భూటియా గ్రామానికి చెందిన  12ఏళ్ల బాలికపై సంవత్సర కాలంగా.. ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా... ముగ్గురు నిందితులకు బాలిక తల్లి సహాయం చేయడం గమనార్హం. ... కాగా... వారి కిరాతకాన్ని తట్టుకోలేకపోయిన బాలిక... ఈ విషయాన్ని ఆలస్యంగా తండ్రికి తెలియజేసింది.

కడుపున పుట్టిన బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి అల్లాడిపోతుంది. అలాంటిది...  ఓ తల్లి.. తన బిడ్డ పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించింది. కూతురిపై ముగ్గురు వ్యక్తులు సంవత్సరంపాటుగా... అత్యాచారానికి పాల్పడుతుంటే... ఆ కిరాతకులకు సహాయం చేసింది. ఈ దారుణ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రం పాలిటానా తాలుకా భూటియా గ్రామానికి చెందిన  12ఏళ్ల బాలికపై సంవత్సర కాలంగా.. ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా... ముగ్గురు నిందితులకు బాలిక తల్లి సహాయం చేయడం గమనార్హం. ... కాగా... వారి కిరాతకాన్ని తట్టుకోలేకపోయిన బాలిక... ఈ విషయాన్ని ఆలస్యంగా తండ్రికి తెలియజేసింది.

వెంటనే విషయం తెలుసుకున్న బాలిక తండ్రి.. తన భార్య, ఆ ముగ్గురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు శాంతి దందుకియా(46), బుభాయ్ సర్తన్పారా(43), చంద్రేశ్ సర్తన్పారా(32) గా గుర్తించారు.  వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?