పిల్లలు పుట్టడంలేదు, వేరే పెళ్లి చేసుకుంటా.. అన్న భర్త.. మనస్తాపంతో భార్య..

Published : Oct 29, 2020, 11:11 AM IST
పిల్లలు పుట్టడంలేదు, వేరే పెళ్లి చేసుకుంటా.. అన్న భర్త.. మనస్తాపంతో భార్య..

సారాంశం

పిల్లలు పుట్టడం లేదు.. నేను వేరే పెళ్లి చేసుకుంటా అని భర్త తరచుగా వేధిస్తుండడంతో ఓ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు, మాచర్ల మండలం చింతలతండా గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ పాల్‌ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలతండాకు చెందిన దనావత్‌ మౌనిక(20)కు తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరుకు చెందిన అశోక్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. 

అశోక్‌ అనుమానంతో భార్యను వేధిస్తూ ఉండేవాడు. పెద్దల సమక్షంలో పంచాయితీలు జరగడం తిరిగి కాపురం పంపడం జరుగుతూ వస్తోంది. ఈ నెల 21న ఇతరుల ఫోన్‌తో మౌనిక తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. భర్త చేయి చేసుకోవడంతో మౌనిక పుట్టింటికి చేరింది. 

ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండడంతో దసరా పండుగకు అశోక్‌ కుటుంబ సభ్యులు చింతలతండాకు వచ్చి వెళ్లారు. ‘నీకు పిల్లలు పుట్టడం లేదు.. నేను వేరే పెళ్లిచేసుకుంటా..’ అని అశోక్‌ తన భార్యతో పలుసార్లు అనడంతో మనస్థాపం చెందిన మౌనిక ఇంట్లో ఉన్న గడ్డిమందును ఈనెల 26న తాగి ఆత్మహత్యకు యత్నించింది. 

గమనించిన కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మరుసటి రోజు గుంటూరుకు తరలిస్తుండడంతో మార్గమధ్యంలో మౌనిక మరణించింది. మృతదేహాన్ని స్వగ్రామమైన చింతలతండాకు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం మౌనిక మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పాల్‌ రవీందర్‌ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport