వరద నీటిలో బ్యూటీ హాట్ ఫోటో షూట్... తిట్టిపోస్తున్న నెటిజన్లు

Published : Oct 01, 2019, 12:40 PM IST
వరద నీటిలో బ్యూటీ హాట్ ఫోటో షూట్... తిట్టిపోస్తున్న నెటిజన్లు

సారాంశం

వరదలతో పొంగిపోర్లుతున్న రోడ్డుపై హాట్ గా తయారై... ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె దిగిన ఫోటోల్లో కూడా వరద తీవ్రత స్పష్టంగా కనపడుతోంది. ఒకవైపు ఓ భారీ వృక్షం కూలిపోయి ఉంది. అవేమీ పట్టనట్టు ఆమె మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.

దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు వరదలతో పొంగిపోతున్నాయి. దీంతో... చాలా మంది ప్రజలు కనీసం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టడానికి కూడా భయపడిపోతున్నారు. కనీస అవసరాలు లభించక ఇబ్బందిపడుతున్న వారు కూడా ఉన్నారు. ఇక బిహార్ రాష్ట్రం లో అయితే... ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దాదాపు 30మంది బిహార్ లో చనిపోయారు. అలాంటి పరిస్థితిలో వారికి సహాయం చేయాల్సిందిపోయి.. ఓ బ్యూటీ హాట్ ఫోటో షూట్ చేసుకుంది.

వరదలతో పొంగిపోర్లుతున్న రోడ్డుపై హాట్ గా తయారై... ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె దిగిన ఫోటోల్లో కూడా వరద తీవ్రత స్పష్టంగా కనపడుతోంది. ఒకవైపు ఓ భారీ వృక్షం కూలిపోయి ఉంది. అవేమీ పట్టనట్టు ఆమె మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం. అది కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకోవడం గమనార్హం.

ఆమె పేరు అదితి సింగ్. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో కోర్సును అభ్యసిస్తోంది. తన అందాలను ఆరబోస్తూ ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా... కొన్ని గంటల్లోనే వైరల్ గా మారాయి. అయితే... కొందరు ఆమె అందంగా ఉందంటూ పొగడ్తలు గుప్పిస్తే... మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు చేసే పని ఇందంటూ ఎక్కువగా విమర్శలు వినపడుతున్నాయి. అయితే.... వరదల విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని.. అందుకు నిరసనగానే ఆమె ఇలా చేసిందంటూ కొందరు చెబుతుండటం విశేషం. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?