షాకింగ్ : మొదటిరాత్రి భర్తను చితగ్గొట్టిన భార్య, నగలు డబ్బుతో పరార్... !!

Published : Mar 19, 2021, 04:36 PM IST
షాకింగ్ : మొదటిరాత్రి భర్తను చితగ్గొట్టిన భార్య, నగలు డబ్బుతో పరార్... !!

సారాంశం

ఎన్నో మధురోహలతో శోభనం గదిలోకి అడుగుపెట్టిన ఆ వరుడికి అనుకోని ట్విస్ట్ ఇచ్చింది వధువు. పెళ్లైన కొద్ది గంటలకే భర్తకు చుక్కలు చూపించింది. దీంతో ఆ వరుడు బేర్ మన్నాడు. గదిలోకి వెళ్ళగానే భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఆ నవవధువు. భర్త తలపై కొట్టి నగలు డబ్బు తీసుకుని ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఉడాయించింది. నమ్మలేని ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో వెలుగుచూసింది.

అధికారిక సమాచారం ప్రకారం బిజ్నోర్ జిల్లాలోని కుండా ఖుర్ద్ గ్రామానికి చెందిన యువకుడికి, హరిద్వార్ కు చెందిన ఓ యువతి కి రెండు రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అంతా బాగానే ఉంది. పెళ్లి తరువాత రాత్రికి శోభనానికి ఏర్పాట్లు చేశారు ఇరు కుటుంబసభ్యులు. 

సరదాలు, ఆటపట్టించాడాలతో వధువును, వరుడిని గదిలోకి పంపించి కుటుంబసభ్యులంతా నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన ఆ నవ వధువు.. భర్తను ప్రేమతో ఆలింగనం చేసుకోవాల్సింది పోయి.. ఇనుపరాడ్డుతో దాడి చేసింది. తలమీద కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. 

వెంటనే బంగారు ఆభరణాలు, రెండు లక్షల నగదు, సెల్ ఫోన్ తీసుకుని వధువు తన ప్రియుడితో కలిసి ఎస్కేప్ అయ్యింది. కొన్ని గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన వరుడు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించాడు. దీంతో కుటుంబసభ్యులంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు.

తన భర్తను కొట్టి డబ్బులు బంగారు ఆభరణాలు తీసుకుని ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. పారిపోయిన యువతి, ఆమె ప్రియుడి కోసం గాలింపు చేపట్టిన అప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఘటన ఎలా జరిగిందనే దానిపై పోలీసులు వివరాలు సేకరించారు.

వధువు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. భర్తను కొట్టి పారిపోయిన యువతికి ఈ పెళ్లి అంటే ఇష్టం లేదట. పెళ్లికి ముందే ఆమె ఓ వ్యక్తిని ప్రేమించిందని పోలీసులు గుర్తించారు. అతని కోసమే ఆమె ఇలా పారిపోయిందని తేల్చారు.

కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న వధువు అతని ప్రియుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటన వరుడు గ్రామంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏ ఇద్దరు కలిసినా అదే అంశంపై చర్చించుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే