లక్నో: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 7దశల్లో జరగనున్న యూపీ ఎన్నికల్లో మొదటిదశ పోలింగ్ ఇవాళ(గురువారం) కొద్దిక్షణాల ముందే ప్రారంభమయ్యింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. ఈ మొదటి దశలో పశ్చిమ యూపీలోని 11జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 623 మంది అభ్యర్థులు ఈ మొదటి దశలో పోటీలో నిలిచారు.

06:57 PM (IST) Feb 10
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సమయం ముగిసినప్పటికీ ఇంకా క్యూలైన్‌లోనే వున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు.
04:17 PM (IST) Feb 10
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నాం 3 గంటల వరకు 44.94 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
03:09 PM (IST) Feb 10
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 35 శాతం పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినట్లుగా తెలుస్తోంది. దీంతో నిపుణులు వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
01:56 PM (IST) Feb 10
యూపీలో మొదటిదశ ఎన్నిక జరుగుతున్న జిల్లాలో అత్యధికంగా శామ్లీలో 41శాతం పోలింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా అలీఘడ్ లో 32.07శాతం పోలింగ్ నమోదయ్యింది.
01:52 PM (IST) Feb 10
ఉత్తర ప్రదేశ్ లో మొదటి దశ పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటివరకు అంటే మధ్యాహ్నం ఒంటిగంట వరకు 35.03శాతం పోలింగ్ నమోదయ్యింది.
01:34 PM (IST) Feb 10
బాగ్ పత్ జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 37.91 శాతం పోలింగ్ నమోదయ్యింది.
01:28 PM (IST) Feb 10
తనకు మధురలో ఓటుహక్కు వుందని...కానీ తాను ప్రస్తుతం తాను బిజ్నోర్ లో ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్నట్లు ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి తెలిపారు. ఇప్పటికే తన భార్య ఓటేసిందని... తాను కూడా ఓటు వేయడానికి ప్రయత్నిస్తానని జయంత్ తెలిపారు. ప్రచారాన్ని త్వరగా ముగించుకుని మధురకు బయలుదేరతానని ఆయన తెలిపారు..
01:04 PM (IST) Feb 10
మేరట్ జిల్లా కిటౌర్ నియోజకవర్గం భడౌలీ గ్రామంలో సమాజ్ వాది పార్టీ-బిజెపి శ్రేణులు బాహాబాహీకి దిగారు. దొంగఓట్లు వేయిస్తున్నారంటే ఓ పార్టీ నాయకులపై మరో పార్టీ నాయకలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణ ఏర్పడింది. పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
12:53 PM (IST) Feb 10
ఉత్తర ప్రదేశ్ లో మొదటిదశ ఎన్నికల్లో భాగంగా ముజఫర్ నగర్ లో ఇవాళ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ పోలింగ్ కేంద్రానికి ఓటేయడానికి వచ్చిన 105ఏళ్ళ వృద్దురాలిని చూసి అందూ ఆశ్చర్యపోయారు. ఈ వయసులోనే ఓటేయడానికి వచ్చిన ఆమె తరం యువతీయువకులు ఆదర్శంగా నిలిచారు. కొంత సమయం కేటాయించి ఓటేయడానికే బద్దకిస్తున్నవారికి ఈ వృద్దురాలిని చూసయినా మారాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతులున్నారు.
12:36 PM (IST) Feb 10
మధురలో దేవకీనందన్ ఠాకూర్ జీ మహరాజ్ కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. కృష్ణా నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటేసారు.
12:22 PM (IST) Feb 10
యూపీలో జరుగుతున్న మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటుహక్కను వినియోగించుకున్నారు. తాజాగా ముజఫర్ నగర్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి సంజీవ్ భల్యాన్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
11:57 AM (IST) Feb 10
మొదటిదశలో పోలింగ్ జరుగుతున్న 11 జిల్లాల్లో అత్యధికంగా శామ్లీ లో అత్యధికంగా 22.83శాతం, అత్యల్ఫంగా అలీఘడ్ లో 17.91శాతం పోలింగ్ నమోదయ్యింది.
11:51 AM (IST) Feb 10
ఉత్తర ప్రదేశ్ లో మెదటి దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఆరంభంలో కాస్త మందకోడిగా సాగినా ప్రస్తుతం ఊపందుకుంది. 11 గంటల వరకు అంటే నాలుగుగంటల్లో 20శాతం పోలింగ్ నమోదయ్యింది.
11:43 AM (IST) Feb 10
ఇవాళ అతడి పెళ్లి. అయినా ఓటుహక్కును వినియోగించుకునేందుకు పెళ్ళికొడుకు పోలింగ్ బూత్ కు కదిలాడు. 'ముందు ఓటు... ఆ తర్వాతే పెళ్ళి' అంటూ ముజఫర్ నగర్ కు చెందిన అంకుర్ అనే యువకుడు పెళ్ళికొడుకు వేషంలోనే ఓటుహక్కును వినియోగించుకున్నారు.
11:33 AM (IST) Feb 10
మధురలో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న ఆయన ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఓటుహక్కును వినియోగించుకోలేకపోతున్నాడు. ఆయన ఇవాళ పోలింగ్ లో పాల్గోనడం లేదని పార్టీ వర్గాలు తెలిపారు.
11:09 AM (IST) Feb 10
10:59 AM (IST) Feb 10
ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న మొదటిదశ పోలింగ్ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా వృద్దులు చలినిసైతం లెక్కచేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇలా మేరట్ లో 101 సంవత్సరాల వృద్దురాలు ఓటుహక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచింది. ఓటు హక్కు వినియోగించుకోకుండా నిర్లక్ష్యం వహించేవారు ఈ వృద్దురాలిని చూసయినా మారాలి.
10:32 AM (IST) Feb 10
10:24 AM (IST) Feb 10
శామ్లీ జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ జస్జిత్ కౌర్ తెలిపారు. అక్కడక్కడ ఈవీఎం సమస్యలు తలెత్తగా వెంటనే ఆయా పోలింగ్ బూతుల్లో సమస్యను పరిష్కరించే ప్రయత్న చేస్తున్నామన్నారు. ఎక్కడా శాంతిభద్రతల సమస్య లేదని కలెక్టర్ వెల్లడించారు.
10:13 AM (IST) Feb 10
కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బగేల్ దక్షిణ ఆగ్రా నియోజకవర్గంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
09:58 AM (IST) Feb 10
ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీ రాణి మౌర్య యూపీలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆగ్రా గ్రామీణ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా బేబీ రాణి బరిలో వున్నారు. అభివృద్దే ఎజెండాగా బిజెపి ఈ ఎన్నికల్లో పోటీలో నిలవగా ప్రజల పూర్తి మద్దతు లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆగ్రాలోని తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు బిజెపి కైవసం చేసుకుంటుందని బేబీ రాణి దీమా వ్యక్తం చేసారు.
"
09:46 AM (IST) Feb 10
యూపీ లో మొదటిదశ పోలింగ్ జరుగుతున్న 11జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో ఇప్పటివరకే 7.93శాతం పోలింగ్ నమోదయ్యింది. అత్యధికంగా భాగ్ పత్ జిల్లాలో 8.93శాతం నమోదయితే అత్యల్పంగా ఘజియాబాద్ జిల్లా 7.37శాతం పోలింగ్ నమోదయ్యింది.
09:31 AM (IST) Feb 10
మీరట్ లోని ఏడు నియోజకవర్గాల్లో ఉదయం ఏడుగంటలకే పోలింగ్ ప్రారంభమవగా ఉదయం 9గంటల వరకు 9శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇక మధురలో మొదటి రెండు గంటల్లో 8శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యింది.
09:17 AM (IST) Feb 10
ఉత్తర ప్రదేశ్ లో తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉదయంనుండే ఓటుహక్కును వినియోగించుకోడానికి ఆసక్తి చూపుతూ పోలింగ్ బూతుల వద్ద బారులు తీరితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు ఇళ్లనుండి కదలడంలేదు. ఇలా మీరట్ ప్రజలు ఓటు వేయడానికి అనాసక్తి చూపుతుండటంతో పోలింగ్ కేంద్రాలు బోసిపోతున్నాయి.
09:01 AM (IST) Feb 10
మధుర నియోజకవర్గంలోని కృష్ణానగర్ శారలాబదేవ్ ఇంటర్ కాలేజిలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ మాథుర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మధురలో అధికార బిజెపికి ప్రదీప్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్-బిజెపిల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
08:48 AM (IST) Feb 10
బాగపత్ జిల్లాలోని బడౌత్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగిన కృష్ణపాల్ మాలిక్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య సరళా మాలిక్, సోదరి విమలేశ్ దేవితో కలిసివచ్చిన ఆయన మహాత్మా గాంధీ ఇంటర్ కాలేజ్ లోని పోలింగ్ బూత్ లో ఓటేసారు. ఈ సందర్భంగా కృష్ణపాల్ సోదరి తన సోదరుడి గెలుపును కాంక్షిస్తూ అతడిని ఆశీర్వదించింది.
08:39 AM (IST) Feb 10
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ మొదటిదశ పోలింగ్ జరుగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ యూపీ ఓటర్లకు గుర్తుచేసారు. ప్రతి ఓటర్ కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ పోలింగ్ లో భాగస్వామ్యం కావాలని పీఎం కోరారు. ప్రజాస్వామ్యంలోనే అతి పవిత్రమైన ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని సూచించారు.
08:28 AM (IST) Feb 10
బాగ్ పత్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ లో చీకట్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కరెంట్ పోయింది. ఎంతకూ కరెంట్ రాకపోవడంతో పోలింగ్ సిబ్బంది తమ సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో పోలింగ్ కొనసాగిస్తున్నారు.
08:20 AM (IST) Feb 10
శామిలి నియోజకవర్గంలోని గెహర్ పూర్ పోలింగ్ బూత్ లో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. పోలింగ్ ప్రారంభమై కేవలం 3ఓట్లు మాత్రమే పోలయిన తర్వాత ఈవీఎం పనిచేయడం లేదు. సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఈవీఎం పనిచేయకపోవడంతో టెక్నికల్ సిబ్బందికి వారు సమాచారమిచ్చారు. పోలింగ్ నిలిచిపోవడంతో చల్లటి చలిలో క్యూలో నిలబడి ఓటర్లు ఎదురుచూడాల్సి వస్తోంది.
08:10 AM (IST) Feb 10
మధురలో బలదేవ్ నియోజకవర్గ పరిధిలోని ఫరహ్ పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. 442 పోలింగ్ బూత్ లో ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది.
07:59 AM (IST) Feb 10
యూపీలో మొదటిదశ పోలింగ్ ఇప్పటికే ప్రారంభమవగా కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ముజఫర్ నగర్ లోని ఇస్లామియా ఇంటర్ కాలేజ్ పోలింగ్ కేంద్రంలోని ఓ ఈవీఎం పనిచేయట్లేదని సమాచారం. ఇప్పటివరకు ఆ బూతులో పోలింగ్ ప్రారంభం కాలేదు.
07:46 AM (IST) Feb 10
07:46 AM (IST) Feb 10
07:46 AM (IST) Feb 10
07:45 AM (IST) Feb 10
07:39 AM (IST) Feb 10
07:39 AM (IST) Feb 10
07:35 AM (IST) Feb 10
ఉదయం చల్లటి చలిలో ఒవైపు పొగమంచు కురుస్తున్నా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోడానికి పోలింగ్ బూతులకు కదులుతున్నారు. వృద్దులు కూడా ఈ చలిలో ఇళ్ళనుండి బయటకు వచ్చి ఓటేస్తున్నారు. ఓటేసిన తర్వాత పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటుచేసిన సెల్పీ పాయింట్ వద్ద ఫోటోలకు పోజిస్తున్నారు.
07:20 AM (IST) Feb 10
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల అధికారులు ఓటర్లకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేసారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ మొదటి దశ ఎన్నికల బరిలో మొత్తం 623మంది నిలవగా వీరిలో యోగి కేబినెట్ లోని 9మంది మంత్రులు కూడా వున్నారు.