UP Elections 2022 : ఉద్య‌మంలో మృతి చెందిన రైతు కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం.. స‌మాజ్ వాదీ పార్టీ

Published : Feb 09, 2022, 10:03 AM IST
UP Elections 2022 : ఉద్య‌మంలో మృతి చెందిన రైతు కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం.. స‌మాజ్ వాదీ పార్టీ

సారాంశం

ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం కోటా కల్పిస్తామని, రైతు ఉద్యమం సమయంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చింది. 

UP Election News 2022  : ఉత్తరప్రదేశ్ (utharpradhesh) లో మొద‌టి ద‌శ ఎన్నిక‌ల‌కు ఒక రోజు స‌మ‌యం మ‌త్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో స‌మాజ్ వాదీ పార్టీ మంగ‌ళ‌వారం రాత్రి త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసింది. ‘సమాజ్‌వాదీ వచన్ పాత్ర (samjwadi vachan patra) ’అనే పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ విడుద‌ల చేశారు. ఇందులో గ‌డిచిన నాలుగేళ్లలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని, వ్యవసాయ చట్టాల నిరసనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. స‌మాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వ‌స్తే MNREGA తరహాలోనే పట్టణ స్థాయిలో ‘పట్టణ ఉపాధి హామీ చట్టం’ కూడా తీసుకొస్తామని హామీ ఇచ్చింది.

మేనిఫెస్టోలో ప్ర‌చురించిన హామీలు ఇవే..

స‌మాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వ‌స్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయిస్తామ‌ని పేర్కొంది.  ఫార్మ్స్ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామ‌ని చెప్పింది. అన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తామ‌ని, చెరుకు రైతుల‌కు 15 రోజుల్లో చెల్లింపులు జ‌రుపుతామ‌ని తెలిపింది. 

ప్రతీ ఇంటికి 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమాజ్‌వాదీ పార్టీ క్యాంటీన్‌లు నిర్మించి అందులో ప్ర‌తీ ఒక్క‌రికీ కేవ‌లం రూ.10 ల‌కే ఆహారం అందిస్తామ‌ని తెలిపింది. 

కిసాన్ బజార్ విస్తరిస్తామ‌ని మేనిఫెస్టో తెలిపింది. మూడు నూతన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ర‌ద్దు చేయాల‌ని కోరుతూ నిర‌స‌న చేప‌ట్టిన స‌మ‌యంలో అమ‌రులైన రైతుల జ్ఞాపకార్థం రైతు స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చింది.  

ప్రతీ మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామ‌ని పేర్కొంది. గ్రామాల్లోకి ఆధునిక వ్యవసాయాన్ని తీసుకొస్తామ‌ని చెప్పింది. మూడేళ్లలోపు శిక్షామిత్రలకు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు అందేస్తామ‌ని మేనిఫెస్టో ప్ర‌క‌టించింది. 

ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామ‌ని తెలిపింది. MSME రంగంలో కోటి మందికి ఉపాధి కల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. రెండెకరాలలోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రెండు బస్తాల డీఏపీ, ఐదు బస్తాల యూరియా ఉచితంగా ఉందిస్తామ‌ని తెలిపింది. అలాగే వడ్డీలేని రుణం, సాగునీటికి విద్యుత్, బీమా, పింఛను అందిస్తామి మేనిఫెస్టో చెప్పింది. 

సమాజ్ వాదీ పెన్షన్ యోజన పునఃప్రారంభిస్తామ‌ని పేర్కొంది. పేద కార్మికులు, మేస్త్రీలు, నిరాశ్రయుల కోసం సమాజ్‌వాదీ కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసి సబ్సిడీ రేట్లలో రేషన్, ఇతర నిత్య‌వ‌స‌రాలు ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చింది. 

ప్రతీ BPL కుటుంబానికి సంవత్సరానికి రెండు LPG సిలిండర్లను ఉచితంగా అంద‌జేస్తామ‌ని మేనిఫెస్టో పేర్కొంది. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు క‌ల్పిస్తామ‌ని తెలిపింది. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, సంస్థల్లో బాలికలకు ఉచిత విద్య అంద‌జేస్తామ‌ని చెప్పింది. 

టూ వీల‌ర్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి ప్ర‌తీ నెల ఒక లీట‌ర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తామ‌ని తెలిపింది. ఆటోరిక్షా యజమానుల‌కు ప్రతీ నెలా 6 లీటర్ల పెట్రోల్, 3 కిలోల CNG ఉచితంగా పొందుతార‌ని పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !