రోడ్డు ప్రమాదం: గాయపడిన కేంద్ర మంత్రి, భార్య, వ్యక్తిగత కార్యదర్శి మృతి

Published : Jan 11, 2021, 10:09 PM ISTUpdated : Jan 11, 2021, 10:45 PM IST
రోడ్డు ప్రమాదం: గాయపడిన కేంద్ర మంత్రి, భార్య, వ్యక్తిగత కార్యదర్శి మృతి

సారాంశం

కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ప్రయాణీస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో  కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి.


న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ప్రయాణీస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో  కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి.

కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో సోమవారం నాడు ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఎల్లాపూర్ నుండి గోకర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో శ్రీపాదనాయక్ భార్య మరణించారు.శ్రీపాదనాయక్ వ్యక్తిగత కార్యదర్శి దీపక్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు తెలిపారు. 

అంకోలా తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు చెప్పారు. కారు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే గోవా సీఎంతో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. 

కేంద్ర మంత్రిని గోవాలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రధాని మోడీ వైద్యులను ఆదేశించారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఘటనకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాాదానికి వేగమే కారణమా.. ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

వెనకా, ముందు ఎస్కార్ట్ రైళ్లు.. మధ్యలో రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు. ఇదొక న‌డిచే రాజ‌భ‌వ‌నం
డ్రగ్స్ రహిత సమాజం కోసం మోదీ మాస్టర్ ప్లాన్ | Nasha Mukt Yuva for Viksit Bharat Explained