ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోయిస్టుల మృతి, పోలీసుల కూంబింగ్

Published : Aug 24, 2021, 10:22 AM ISTUpdated : Aug 24, 2021, 10:38 AM IST
ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోయిస్టుల మృతి, పోలీసుల కూంబింగ్

సారాంశం

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మంగళవారం నాడు ఉదయం జరిగిన ఎ‘న్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్టుగా భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో తప్పించుకొన్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మంగళవారం నాడు  పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. 

 సుక్మా జిల్లా కచాయగూడలో  ఇవాళ ఉదయం ఎన్‌కౌంటర్ చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు. ఈ ఎన్ కౌంటర్‌లో ద్దరు మావోయిస్టులు మృతి చెందారు.గొంపాడ్ కన్నయ్యగూడ అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 


మృతుల్లో కొంటా ఏరియా కమాండ్  కవాసి హుంగా కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో మావోయిస్టుల ఆయుధాలు,పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఎన్ కౌంటర్ నుండి కొందరు మావోయిస్టులు తప్పించుకొన్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu