కాంచీపురం:ఆలయం వద్ద పేలుడు, ఇద్దరు మృతి

Published : Aug 26, 2019, 12:14 PM IST
కాంచీపురం:ఆలయం వద్ద పేలుడు, ఇద్దరు మృతి

సారాంశం

కాంచీపురం జిల్లాలోని ఆలయం వద్ద పేలుడు సంబవించింది.ఈ పేలుడులో ఇద్దరు  మృతి చెందారు. 

కాంచీపురం: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని మానామది ఆలయం వద్ద ఆదివారం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని  ఐబీ హెచ్చరించిన నేపథ్యంలోనే ఆదివారం నాడు ఈ ఆలయం వద్ద పేలుడు సంబవించడంతో  పోలీసు శాఖ అప్రమత్తమైంది.

ఈ ఆలయ కొనులో పూడిక తీత పనుల సమయంలో పేలుడు చోటు చేసుకొంది. ఇదే గ్రామానికి చెందిన సూర్య అనే యువకుడు స్నేహితులతో కలిసి కొలను వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ బాక్స్ లభించింది. దాన్ని ఆలయం వద్దకు తీసుకొచ్చి తెరిచారు. దాన్ని తెరవడంతో ఆ బాక్స్  పేలింది.

ఈ శబ్దంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన సూర్యతో పాటు మరో వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు.  వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ పేలుడు దాటికి ఆలయం వద్ద గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. చెంగల్పట్టు, మహాబలిపురం డీఎస్పీలు  బాంబ్ స్వ్కాడ్ లు రంగంలోకి దిగాయి.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం