సూట్‌కేసులో 14 ఏళ్ల బాలిక మృతదేహం.. వారం రోజుల తర్వాత ఇద్దరు నిందితుల అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published Sep 3, 2022, 5:51 PM IST
Highlights

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వాలివ్ ప్రాంతంలో రోడ్డు పక్కన సూట్‌కేసులో బాలిక మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వారం రోజుల తర్వాత ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వాలివ్ ప్రాంతంలో రోడ్డు పక్కన సూట్‌కేసులో బాలిక మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారం రోజుల తర్వాత గుజురాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. వివరాలు.. ముంబయిలోని అంధేరీకి చెందిన 14 ఏళ్ల విద్యార్థి ఆగస్టు 25న పాఠశాలకు వెళ్లింది. ఆ తర్వాత బాలిక కనిపించుకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి.. బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 

అయితే ఆ మరుసటి బాలిక మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, సూట్‌కేస్‌లో పెట్టి నైగావ్ సమీపంలోని రోడ్డు పక్కన పొదల్లో పారేసినట్లుగా గుర్తించారు. దీంతో మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. బాలిక హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌లన పరిశీలించారు. 

ఈ కేసుకు సంబంధించి  ప్రాథమిక విచారణలో బాలిక హత్యలో ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు నిందితులను శుక్రవారం రాత్రి గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో అరెస్టు చేశామని చెప్పారు. హత్య వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా వెల్లడించారు. 

click me!