రోడ్ స్టాపర్ గా అడవిలో పెద్ద పులి.. నెట్టింట వీడియో వైరల్..!

Published : May 02, 2023, 10:32 AM IST
రోడ్ స్టాపర్ గా  అడవిలో పెద్ద పులి.. నెట్టింట వీడియో వైరల్..!

సారాంశం

ఓ చిన్న నీటి కుంటలో అది నీరు తాగుతూ కనిపించింది. పులికి  ఇబ్బంది కలగడకూడదని ఫారెస్టు అధికారులు వాహనం ఆపేయడం గమనార్హం. ఈ వీడియోకి ది రోడ్ స్టాపర్ అంటూ షేర్ చేశారు.

అడవిలో పెద్దపులిని మనం చాలా గొప్పగా ఊహించుకుంటాం. పులి ఉగ్రతకు చిహ్నం. పులి వైభవాన్ని చూడటాన్ని మనమందరం ఇష్టపడతాం. అలాంటి పులి.. దాహం వేసి ఓ చిన్న నీటి కుంటలో నీరు తాగింది. దానిని డిస్టర్బ్ చేయడం ఇష్టంలేక ఓ వాహనం అక్కడ ఆపేయడం గమనార్హం. దీనిని ఓ ఫారెస్ట్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ ఉత్తరప్రదేశ్‌లోని కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం గుండా వెళుతున్న జాతీయ రహదారి పక్కన అడవి బెంగాల్ పులి నీరు త్రాగుతున్న వీడియోను పంచుకున్నారు.

 

ఓ చిన్న నీటి కుంటలో అది నీరు తాగుతూ కనిపించింది. పులికి  ఇబ్బంది కలగడకూడదని ఫారెస్టు అధికారులు వాహనం ఆపేయడం గమనార్హం. ఈ వీడియోకి ది రోడ్ స్టాపర్ అంటూ షేర్ చేశారు.

వాస్తవానికి ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి ఆకాష్ దీప్ బధవాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అతను ఇలా వ్రాశాడు, "అభయారణ్యం  బఫర్ ప్రాంతంలో రేంజ్ ఆఫీసర్ కతర్నియాఘాట్ ఈ రోజు ఉదయం క్లిక్ చేసారు.’ అని క్యాప్షన్ జత చేశారు.

5 గంటల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో ట్విటర్‌లో 40,000కి పైగా వీక్షణలను సేకరించింది. ఈ వీడియో చూసిన కొందరు ట్విటర్ యూజర్లు ఆశ్చర్యపోయారు. ఒక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు, పులిని గౌరవించాల్సిన అవసరం ఉందని, అది నీరు తాగేవరకు వాహనం ఆపడం మంచిదని, హారన్ కొట్టకుండా ఆపడం మంచిదని కామెంట్ చేయడం గమనార్హం.

మరికొందరు అయ్యో.. నీరు తాగడానికి చిన్న కుంటను ఎంచుకుందా అని కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్