తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

04:36 PM (IST) Aug 24
మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలో తెలంగాణలో నెలకొన్న తాజా పరిస్ధితులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డితో పాటు అడిషనల్ డిజి, సిపిలు హాజరయ్యారు.
03:43 PM (IST) Aug 24
మహ్మద్ ప్రవక్తపై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించింది. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న ముస్లీంల మనోభావాలను దెబ్బతీసాయని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. వెంటనే రాజాసింగ్ పై కఠిన చర్యలు తీసుకుని మరోసారి బిజెపి నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలని భారత ప్రభుత్వాన్ని పాక్ విదేశీవ్యవహారాల విభాగం కోరింది.
02:49 PM (IST) Aug 24
మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహా వికాస్ అఘాడీ కూటమి, బిజెపి ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. షిండే వర్గం అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగగా వారికి వ్యతిరేకంగా బిజెపి ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొని అసెంబ్లీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
01:47 PM (IST) Aug 24
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దేశ రాజధాని డిల్లీలో భేటీ అయ్యారు. సాయంత్రం 4గంటలకు ప్రియాంక గాంధీతో భేటీ కోసం డిల్లీకి చేరుకున్న కోమటిరెడ్డి నేరుగా ఉత్తమ్ నివాసానికి వెళ్లారు. ఇద్దరిమధ్య లంచ్ మీటింగ్ జరిగింది.
01:10 PM (IST) Aug 24
డిల్లీ లిక్కర్ స్కాంతో తెలంగాణ సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవితకు సంబంధాలున్నట్లు బిజెపి ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ప్రముఖ నటి జీవితా రాజశేఖర్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసారు. పలు పబ్ లు, క్లబ్స్ లో కేటీఆర్ కు షేర్ వుందని చాలామంది యజమానులు తనతో చెప్పినట్లు జీవిత పేర్కొన్నారు.
12:34 PM (IST) Aug 24
డిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని కూల్చేందుకు బిజెపి విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలు నలుగురిని బిజెపి చేరాలని సంప్రదించారని... ఇందుకుగానూ ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఆఫర్ చేసినట్లు ఆప్ ఎంపీ తెలిపారు. లేదంటే సిబిఐ, ఈడి కేసులను ఎదుర్కోవాల్సి వుంటుందని బిజెపి నాయకులు ఎమ్మెల్యేలను బెదిరించినట్లు సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
11:51 AM (IST) Aug 24
తండ్రి మల్లయ్య మృతితో బాధలో వున్న బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. ఈటలకు ఫోన్ చేసి మాట్లాడిన అమిత్ షా కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. అలాగే ఈటల తండ్రి మల్లయ్య మృతికి అమిత్ షా సంతాపం తెలిపారు.
11:51 AM (IST) Aug 24
తండ్రి మల్లయ్య మృతితో బాధలో వున్న బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. ఈటలకు ఫోన్ చేసి మాట్లాడిన అమిత్ షా కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. అలాగే ఈటల తండ్రి మల్లయ్య మృతికి అమిత్ షా సంతాపం తెలిపారు.
11:08 AM (IST) Aug 24
భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 10,649 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 96,442కు చేరాయి.
10:19 AM (IST) Aug 24
సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా సూపర్ డూపర్ హిట్టయిన అలనాటి భారతీయుడు సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న భారతీయుడు2 షూటింగ్ నేడు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ శంకర్ ప్రకటించారు. ఇప్పటికే చాలాభాగం సినిమా షూటింగ్ పూర్తవగా వివిధ కారణాలతో చాలాకాలంగా షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా అన్ని ఒడిదుడుకులకు దాటుకుని మిగతా భాగం షూటింగ్ కు రంగం సిద్దమైంది. వచ్చేనెలలో హీరో కమల్ హాసన్ షూటింగ్ లో పాల్గొననున్నారు.
09:30 AM (IST) Aug 24
బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున క్యాంపస్ లోని ఓ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. దీంతో మరోసారి విద్యార్థులు ఆంందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మొహరించారు. అయితే ఇప్పటివరకకు విద్యార్థి ఆత్మహత్యపై ట్రిపుట్ ఐటీ అధికారులు ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
09:19 AM (IST) Aug 24
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాష్ట్రవ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కరీంనగర్ లోని తన ఇంటివద్దే నిరసన దీక్షకు బండి సంజయ్ సిద్దమయ్యారు. దీంతో ముందుగానే సంజయ్ ఇంటివద్ద భారీగా పోలీసులను మొహరించడం, భారీగా బిజెపి శ్రేణులు చేరుకుంటుండటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.