నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:47 PM

సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ: ఏపీ ఉద్యోగ సంఘాలు

ఏపీలో ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మె బాట పట్టాయి. సీపీఎస్‌పై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చాయి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే వరకు పోరాటం ఆగదని ఉద్యోగ నేతలు హెచ్చరిస్తున్నారు. 

9:19 PM

విడాకుల వార్తలపై స్పందించిన చాహల్

టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు విడిపోతున్నారంటూ వార్తలు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాహల్ స్పందించాడు. అవన్నీ రూమర్లేనని .. ఎవరూ నమ్మొద్దని సూచించాడు. ఇలాంటి వాటికి ముగింపు పలకాలని ఆయన కోరాడు. 

8:37 PM

సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 లాంచ్

యాపిల్ ఐఫోన్ 14ని సెప్టెంబర్ 7న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులకు ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 16 నుంచి దీనిని రిటైల్ స్టోర్లలో అందుబాటులో వుంచే అవకాశం వుంది. అదే రోజున మూడు కొత్త యాపిల్ వాచ్ మోడల్స్, న్యూ వెర్షన్ ఐ మాక్‌లు, ఐ ప్యాడ్‌లు కూడా లాంచ్ చేసే ఛాన్స్ వుంది. 

7:47 PM

ఆ బోటు వెనుక ఉగ్రకోణం లేదు : మహారాష్ట్ర సర్కార్

గురువారం అరేబియా సముద్ర తీరంలోని రాయ్‌గఢ్ జిల్లాలోని హరిహరేశ్వర్ బీచ్‌కు అనుమానాస్పద బోటు కొట్టుకురావడం కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు 26/11 తరహా దాడులకు కుట్రపన్నారంటే కథనాలు వచ్చాయి. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనలో ఉగ్రవాద కోణం లేదని తెలిపింది. అయితే బోటులో తుపాకీ, మందుగుండు సామాగ్రిపై మాత్రం క్లారిటీ రావాల్సి వుందని మహా సర్కార్ పేర్కొంది. 

7:02 PM

జింబాబ్వేపై టీమిండియా ఘనవిజయం

పసికూన జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. జింబాబ్వే విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 30.5 ఓవర్లలోనే ఊదిపడేశారు ఓపెనర్లు...  శిఖర్ ధావన్ 113 బంతుల్లో 9 ఫోర్లతో 81 పరుగులు, శుబ్‌మన్ గిల్ 72 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు.

6:21 PM

8 వారాల తర్వాతే ఓటీటీల్లోకి సినిమా: దిల్‌రాజు

ఓటీటీల్లో సినిమాల విడుదలకు సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి సినిమా విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ను అనుమతిస్తామని ఆయన తెలిపారు. అలాగే త్వరలోనే సినిమా షూటింగ్‌‌ల పున: ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని దిల్‌రాజు చెప్పారు. 

5:22 PM

రూ.1000 కోట్లు అప్పును తీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఎన్ని విమర్శలు వెల్లువెత్తినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం అప్పుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే వుంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా జగన్ ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల రుణం తీసుకుంది. గురువారం జరిగిన సెక్యూరిటీ వేలం ద్వారా రూ.500 కోట్ల చొప్పున వెయ్యి కోట్లను రుణంగా తీసుకుంది. 13 ఏళ్ల కాలపరిమితితో 7.72 శాతం వడ్డీకి ఈ రుణాన్ని తీసుకుంది ఏపీ ప్రభుత్వం. 

4:33 PM

నష్టాలతో మొదలై లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్

గురువారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత పుంజుకుని స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 38 పాయింట్లు లాభపడి 60,298, నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 17,957 వద్ద ముగిసాయి. 

3:28 PM

నాతో పాటు ఎమ్మెల్యే వంశీ పేరు చెప్పాలని చికోటికి బెదిరింపులు...: కొడాలి నాని సంచలనం

ఈడీ అధికారులకు తనతో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు చెప్పాలని చీకోటి ప్రవీణ్ ను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చీకోటీ ప్రవీణ్ బయటపెట్టారని అన్నారు. కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారంటూ చీకోటి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నాని ఈ కామెంట్స్ చేసారు. 

2:32 PM

ఆ గ్రంథాల జోలికొస్తే బౌతికదాడులే...:  బండి సంజయ్ సంచలనం

వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన ప్రకటనలు చేసే తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ తన ప్రజాసంగ్రామ యాత్రలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. హిందువులు పవిత్ర గ్రంథాలయిన భగవద్గీత, రామాయణంను కొందరు అవమానించేలా వ్యవహరిస్తున్నారని... ఇలాంటి వారిపై బౌతిక దాడులకే సిద్దమేనని అన్నారు. రాష్ట్రంలో  బ్రాహ్మణులకు రక్షణ కూడా లేదని సంజయ్ పేర్కొన్నారు. 

1:27 PM

ఇండియా వర్సెస్ జింబాబ్వే ఫస్ట్ వన్డే... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. మూడు నెలల తర్వాత భారత జట్టులో ఆడుతున్న కెఎల్ రాహుల్ ఈ వన్డేకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు. దీపక్ చాహర్ కూడా చాలారోజుల తర్వాత భారత జట్టులో కనిపించారు. 

12:29 PM

114 కోట్ల వ్యూస్ కలిగిన యూట్యూబ్ ఛానల్స్ కి కేంద్రం షాక్...

భారత సమగ్రతను దెబ్బతీసేలా, విదేశీ వ్యవహారాలపై దుష్ఫ్రచారం చేస్తున్న ఎనిమిది ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ పై కేంద్రం ప్రభుత్వం వేటువేసింది. ఇలా భారత్ లో బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ లో  ఒకటి పాకిస్థాన్ నుండి కార్యాకలాపాలు సాగిస్తోంది. ఇలా నిషేదానికి గురయని యూట్యూబ్ ఛానల్స్ మొత్తం వ్యూస్ 114 కోట్లుగా వుండగా సబ్ స్క్రైబర్లు 85.73 లక్షలుగా వుంది. 

11:20 AM

బంజారాహిల్స్ ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం... స్కూల్ విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం చోటుచేసుకుంది. స్వంతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ సినిమా చూసేందుకు వెళ్లిన భారతీయ విద్యా భవన్ స్కూల్ విద్యార్థులు ఎస్కలేటర్ పైనుండి పడి గాయపడ్డారు. ఎస్కలేటర్ స్పీడ్ గా కదలడంతో 9 మంది విద్యార్థులు కిందపడిపోయి గాయపడ్డారు. వెంటనే గాయపడ్డ విద్యార్థులకు అపోలో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలవగా మిగతా ఇద్దరు మాత్రం తీవ్రగా గాయపడ్డారు. 

10:41 AM

బండిసంజయ్ పాదయాత్రతో జనగామలో ఉద్రిక్తత

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర సందర్భంగా జనగామలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిజెపి, టీఆర్ఎస్ ఫోటాపోటీగా ప్లెక్సీలు, హోర్డింగ్ లతో పాటు నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చాక పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ను స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్ చేసారు.

9:50 AM

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలంగాణలో మళ్లీ వర్షాలు: వాతావరణ సంస్థ

తెలంగాణలో ఇవాళ, రేపు (గురు, శుక్రవారం) పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదు కానుందని వాతావరణ సంస్థ ప్రకటించింది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతో మళ్లీ జోరుగా వర్షాలు కురవచ్చని తెలిపారు. 
 
9:36 AM

సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... 8మందికి గాయాలు

సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుండి హైదరాబాద్ కు బయలుదేరిన బస్సు చిలమత్తూరు మండలం కోడూరు దగ్గర లారీని ఢీకొట్టింది. దీంతో 8మంది ప్రయాణికులు గాయపడ్డారు. 
 
9:47 PM IST:

ఏపీలో ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మె బాట పట్టాయి. సీపీఎస్‌పై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చాయి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే వరకు పోరాటం ఆగదని ఉద్యోగ నేతలు హెచ్చరిస్తున్నారు. 

9:19 PM IST:

టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు విడిపోతున్నారంటూ వార్తలు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాహల్ స్పందించాడు. అవన్నీ రూమర్లేనని .. ఎవరూ నమ్మొద్దని సూచించాడు. ఇలాంటి వాటికి ముగింపు పలకాలని ఆయన కోరాడు. 

8:37 PM IST:

యాపిల్ ఐఫోన్ 14ని సెప్టెంబర్ 7న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులకు ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 16 నుంచి దీనిని రిటైల్ స్టోర్లలో అందుబాటులో వుంచే అవకాశం వుంది. అదే రోజున మూడు కొత్త యాపిల్ వాచ్ మోడల్స్, న్యూ వెర్షన్ ఐ మాక్‌లు, ఐ ప్యాడ్‌లు కూడా లాంచ్ చేసే ఛాన్స్ వుంది. 

7:47 PM IST:

గురువారం అరేబియా సముద్ర తీరంలోని రాయ్‌గఢ్ జిల్లాలోని హరిహరేశ్వర్ బీచ్‌కు అనుమానాస్పద బోటు కొట్టుకురావడం కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు 26/11 తరహా దాడులకు కుట్రపన్నారంటే కథనాలు వచ్చాయి. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనలో ఉగ్రవాద కోణం లేదని తెలిపింది. అయితే బోటులో తుపాకీ, మందుగుండు సామాగ్రిపై మాత్రం క్లారిటీ రావాల్సి వుందని మహా సర్కార్ పేర్కొంది. 

7:02 PM IST:

పసికూన జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. జింబాబ్వే విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 30.5 ఓవర్లలోనే ఊదిపడేశారు ఓపెనర్లు...  శిఖర్ ధావన్ 113 బంతుల్లో 9 ఫోర్లతో 81 పరుగులు, శుబ్‌మన్ గిల్ 72 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు.

6:21 PM IST:

ఓటీటీల్లో సినిమాల విడుదలకు సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి సినిమా విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ను అనుమతిస్తామని ఆయన తెలిపారు. అలాగే త్వరలోనే సినిమా షూటింగ్‌‌ల పున: ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని దిల్‌రాజు చెప్పారు. 

5:22 PM IST:

ఎన్ని విమర్శలు వెల్లువెత్తినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం అప్పుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే వుంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా జగన్ ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల రుణం తీసుకుంది. గురువారం జరిగిన సెక్యూరిటీ వేలం ద్వారా రూ.500 కోట్ల చొప్పున వెయ్యి కోట్లను రుణంగా తీసుకుంది. 13 ఏళ్ల కాలపరిమితితో 7.72 శాతం వడ్డీకి ఈ రుణాన్ని తీసుకుంది ఏపీ ప్రభుత్వం. 

4:33 PM IST:

గురువారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత పుంజుకుని స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 38 పాయింట్లు లాభపడి 60,298, నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 17,957 వద్ద ముగిసాయి. 

3:28 PM IST:

ఈడీ అధికారులకు తనతో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు చెప్పాలని చీకోటి ప్రవీణ్ ను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చీకోటీ ప్రవీణ్ బయటపెట్టారని అన్నారు. కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారంటూ చీకోటి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నాని ఈ కామెంట్స్ చేసారు. 

2:32 PM IST:

వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన ప్రకటనలు చేసే తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ తన ప్రజాసంగ్రామ యాత్రలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. హిందువులు పవిత్ర గ్రంథాలయిన భగవద్గీత, రామాయణంను కొందరు అవమానించేలా వ్యవహరిస్తున్నారని... ఇలాంటి వారిపై బౌతిక దాడులకే సిద్దమేనని అన్నారు. రాష్ట్రంలో  బ్రాహ్మణులకు రక్షణ కూడా లేదని సంజయ్ పేర్కొన్నారు. 

1:27 PM IST:

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. మూడు నెలల తర్వాత భారత జట్టులో ఆడుతున్న కెఎల్ రాహుల్ ఈ వన్డేకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు. దీపక్ చాహర్ కూడా చాలారోజుల తర్వాత భారత జట్టులో కనిపించారు. 

12:29 PM IST:

భారత సమగ్రతను దెబ్బతీసేలా, విదేశీ వ్యవహారాలపై దుష్ఫ్రచారం చేస్తున్న ఎనిమిది ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ పై కేంద్రం ప్రభుత్వం వేటువేసింది. ఇలా భారత్ లో బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ లో  ఒకటి పాకిస్థాన్ నుండి కార్యాకలాపాలు సాగిస్తోంది. ఇలా నిషేదానికి గురయని యూట్యూబ్ ఛానల్స్ మొత్తం వ్యూస్ 114 కోట్లుగా వుండగా సబ్ స్క్రైబర్లు 85.73 లక్షలుగా వుంది. 

11:20 AM IST:

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం చోటుచేసుకుంది. స్వంతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ సినిమా చూసేందుకు వెళ్లిన భారతీయ విద్యా భవన్ స్కూల్ విద్యార్థులు ఎస్కలేటర్ పైనుండి పడి గాయపడ్డారు. ఎస్కలేటర్ స్పీడ్ గా కదలడంతో 9 మంది విద్యార్థులు కిందపడిపోయి గాయపడ్డారు. వెంటనే గాయపడ్డ విద్యార్థులకు అపోలో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలవగా మిగతా ఇద్దరు మాత్రం తీవ్రగా గాయపడ్డారు. 

10:41 AM IST:

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర సందర్భంగా జనగామలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిజెపి, టీఆర్ఎస్ ఫోటాపోటీగా ప్లెక్సీలు, హోర్డింగ్ లతో పాటు నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చాక పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ను స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్ చేసారు.

9:50 AM IST:

తెలంగాణలో ఇవాళ, రేపు (గురు, శుక్రవారం) పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదు కానుందని వాతావరణ సంస్థ ప్రకటించింది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతో మళ్లీ జోరుగా వర్షాలు కురవచ్చని తెలిపారు. 
 
9:36 AM IST: