తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

09:58 PM (IST) Jul 28
తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్ క్రీడలను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించారు. చెస్ కు పుట్టినిల్లుగా చెన్నై వర్ధిల్లుతోందని .. చెస్ గ్రాండ్ మాస్టర్లకు తమిళనాడు నిలయంగా ఉందని ప్రధాని ప్రశంసించారు.
09:18 PM (IST) Jul 28
5జీ స్పెక్ట్రమ్ వేలం మూడో రోజు ముగిసింది. రెండ్రోజుల్లోనే ముగుస్తుందనుకున్న ఈ వేలం.. రేపు కూడా కొనసాగుతుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గురువారం నాటికి 16 రౌండ్లు బిడ్లు దాఖలైనట్లు ఆయన చెప్పారు. వీటి విలువ రూ. 1,49,623 కోట్లని వైష్ణవ్ చెప్పారు.
08:09 PM (IST) Jul 28
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పై జాతీయ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా ఆయనకు నోటీసులు పంపింది. ఎన్‌సీడబ్ల్యూతో పాటు 13 రాష్ట్ర మహిళా కమీషన్‌లు కూడా ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
07:21 PM (IST) Jul 28
దేశంలోని సంపన్న పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ క్యాపిటల్ 2024 నాటికి ఐపీవోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 శాతం వాటాలను విక్రయించడం ద్వారా రూ.1,500 కోట్లు సమీకరించే యోచనలో వున్నట్లుగా అదానీ క్యాపిటల్ ఎండీ, సీఈవో గౌరవ్ గుప్తా వెల్లడించారు
06:42 PM (IST) Jul 28
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గురువారం గుజరాత్‌లోని సబర్ డెయిరీ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయంతో పాటు పశువులు, చేపల పెంపకం, తేనే వంటి ఇతర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నామని ప్రధాని తెలిపారు.
06:10 PM (IST) Jul 28
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. టీడీపీ టికెట్‌పై 1983, 1985, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నుంచి పుష్పరాజ్ గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లలో ఆయన మంత్రిగానూ పనిచేశారు.
05:21 PM (IST) Jul 28
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ‘రాష్ట్రపత్ని’గా పేర్కొన్నందుకు తన తప్పును అంగీకరిస్తున్నాని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. తాను రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతానని అన్నారు. తాను బెంగాలీ వాడినని, హిందీ అలవాటు లేదని తెలిపారు. రాష్ట్రపతిని తాను స్వయంగా కలిసి క్షమించాలని కోరుతానని అన్నారు.
04:26 PM (IST) Jul 28
మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ పై మమతా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన మంత్రి పదవిని తొలగిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
03:51 PM (IST) Jul 28
భారత స్టాక్ మార్కెట్స్ గురువారం భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 1041 పాయింట్లు లాభపడి 56,853 వద్ద, నిప్టీ 287 పాయింట్లు లాభపడి 16,929 వద్ద మగిసాయి.
03:36 PM (IST) Jul 28
నేపాల్‌లో క్యాసినోలు నిర్వహిస్తూ, హీరోయిన్లతో గ్రాండ్ పబ్లిసిటీ చేసిన ప్రవీణ్ చికోటి కస్టమర్లలో పలువురు ప్రముఖులు వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈడీ తనిఖీలలో 200 మంది కస్టమర్ల జాబితా కూడా బయటపడినట్లుగా తెలుస్తోంది. వీరిలో తెలంగాణకు చెందిన ఓ మంత్రి, ఏపీకి చెందిన ఓ మాజీ మంత్రి కూడా వున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. నేపాల్, ఇండోనేషియా, శ్రీలంకలకు వీరిని పంపించేవాడని తెలుస్తోంది.
02:45 PM (IST) Jul 28
తెలంగాణ ప్రభుత్వం రాజధాని హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి సిద్దమయ్యింది. ఆగస్ట్ 4న సీఎం కేసీఆర్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించనున్నారు.
02:00 PM (IST) Jul 28
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అంటూ అవమానించేలా కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి మాట్లాడటాన్ని తప్పుబడుతూ బిజెపి ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఎంపీలు ఆందోళన కొనసాగించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో లోక్ సభను స్పీకర్ మధ్యాహ్నం నాలుగు గంటలవరకు వాయిదా వేసారు.
12:29 PM (IST) Jul 28
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి 'రాష్ట్రపత్ని' అంటూ అవమానకరంగా మాట్లాడటం దుమారం రేపుతోంది. ఓ గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్నతస్థానాన్ని అధిరోహించడం కాంగ్రెస్ పార్టీకి నచ్చనట్లుంది... అందుకే ఇలా అవమానకరంగా మాట్లాడుతున్నారని బిజెపి నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రపత్ని వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి మహిళా మంత్రులు, ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే రాష్ట్రపతి ముర్ముకు క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు.
11:14 AM (IST) Jul 28
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన గిరిజన మహిళ ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి 'రాష్ట్రపత్ని' అంటూ సంబోధించడం బిజెపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది కేవలం రాష్ట్రపతినే కాదు యావత్ దేశాన్ని అవమానించడమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికే కాదు దేశానికి క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేసారు.
10:53 AM (IST) Jul 28
చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష బిజెపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గురువారం రాష్ట్ర అసెంబ్లీలో మూజువాణి ఓటింగ్ నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా అధిక ఓట్లు వచ్చి అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో భూపేష్ భగేల్ సర్కార్ అధికారాన్ని నిలబెట్టుకుంది.
09:57 AM (IST) Jul 28
మండిపోతున్న నిత్యావసరాల ధరలు, ఆహార పదార్థాలపై జీఎస్టి, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టి వర్షాకాల సమావేశాల నుండి సస్పెండయిన ప్రతిపక్ష ఎంపీల ఆందోళన కొనసాగుతుంది. గత రాత్రంతా ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద కూర్చుని నిరసన తెలిపారు. ఇలా పగలూ రాత్రి 50 గంటల పాటు నిరసన చేపట్టాలని నిర్ణయించారు.
Video
09:36 AM (IST) Jul 28
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నారు. రాజధాని హైదరాబాద్ లో మూసీ నది ఒప్పొంగి ప్రవహిస్తోంది. ఇక జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండిపోవడంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో వరద నీరు కోకాపేట- దర్గా రోడ్డుపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.
09:17 AM (IST) Jul 28
భారత్ లోకి ప్రవేశించిన మంకీపాక్స్ మరింత ప్రభలకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఈ వ్యాధి నిరోదక టీకా అభివృద్దికి టెండర్లను ఆహ్వానించింది.