తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

09:33 PM (IST) Oct 13
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర కర్ణాకటలో సాగుతోంది. ఈ సందర్భంగా గురువారం రాష్ట్రంలోని మలహళ్లిలోని వేరుశెనగ పంట పొలాల్లోకి దిగి పరిశీలించారు. రాహుల్ వెంట కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వున్నారు.
08:48 PM (IST) Oct 13
పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలన్న విద్యా శాఖ ప్రతిపాదననకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 పేపర్లతో పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. హిందీ మినహా మిగతా సబ్జెక్ట్‌లకు రెండు పేపర్లు వుండేవి.
08:05 PM (IST) Oct 13
వైసీపీ మూడు రాజధానుల నిర్ణయంపై మండిపడ్డారు టీడీపీ ఎం రామ్మోహన్ నాయుడు. భూముల కబ్జా కోసమే విశాఖ నగరాన్ని ఎంచుకున్నారని.. విశాఖ రాజధాని కాదు, విజయసాయిరెడ్డి రాజధాని అని ఆయన సెటైర్లు వేశారు. రాజధానుల మార్పు నిర్ణయం అప్పుడు తుగ్లక్‌ది.. నేను జగన్‌ది అని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
07:23 PM (IST) Oct 13
కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి గెలుపును అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించేది కాంగ్రెస్సే కానీ.. టీఆర్ఎస్, బీజేపీలు కావని.. ఆ కమిట్‌మెంట్ వాటికి లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు.
06:25 PM (IST) Oct 13
రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. మూడు రాజధానుల అంశం, ఎల్లుండి విశాఖ వేదికగా భారీ ర్యాలీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశాలపై గవర్నర్‌కు వివరించినట్లుగా తెలుస్తోంది.
05:37 PM (IST) Oct 13
తనపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన పెద్దాయన.. గరికపాటి చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిశారు మెగాస్టారు.
04:24 PM (IST) Oct 13
వచ్చే ఏడాది మార్చిలో మహిళా క్రికెటర్లతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహణకు బిసిసిఐ సిద్దమయ్యింది. మొత్తం ఐదు జట్లతో 20 లీగ్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఒక్క జట్టులో ఐదురుగు విదేశీ క్రికెటర్లను ఆడించే అవకాశం కల్పించారు. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచే జట్టు డైరెక్ట్ గా ఫైనల్ కు వెళ్లనుంది.
03:18 PM (IST) Oct 13
ఇటీవల కేసీఆర్ జాతీయ పార్టీ బిఆర్ఎస్ ప్రకటన నేపథ్యంలో వరంగల్ కు చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి కార్మికులకు మందు బాటిల్లు, కోళ్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈ వ్యవహారం వివాదాస్పంగా మారి ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం స్సందించింది. శ్రీహరి మందు పంపీణీకి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా వరంగల్ కలెక్టర్ ను ఈసీ కోరింది. అలాగే శ్రీహరికి నోటీసులు కూడా జారీ చేసింది.
02:36 PM (IST) Oct 13
భారత వుమెన్ క్రికెట్ టీం ఆసియా కప్ టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ సెమీ ఫైనల్లో థాయ్ లాండ్ తో తలపడ్డ టీమిండియా 74 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక మరో సెమీ ఫైనల్లో శ్రీలంక, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇందులో విజేతగా నిలిచే జట్టుతో భారత్ ఫైనల్లో తలపడనుంది.
01:10 PM (IST) Oct 13
కర్ణాటక హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధం కొనసాగుతుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. సుప్రీం కోర్టు హిజాబ్ పై ఎటూ తేల్చకపోవడంతో హైకోర్టును తీర్పునే అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
11:46 AM (IST) Oct 13
మునుగోడు ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ పోటీచేస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కిన నరసింహులు క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టిడిపి పోటీచేయడం లేదని... ఏ పార్టీకి మద్దతివ్వకుండి తటస్థంగా వుంటుందని ప్రకటించారు.
11:16 AM (IST) Oct 13
విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణ వివాదంపై సుప్రీం కోర్టు మిశ్రమ తీర్పును వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ను నిషేధంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్ధించగా, నిషేదం సరికాదని జస్టిస్ సుధాన్షు ధులియా పేర్కోన్నారు. ఇలా ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో ఈ వివాదం సిజెఐ వద్దకు చేరింది.
10:20 AM (IST) Oct 13
చత్తీస్ ఘడ్ లో మనీ లాండరింగ్ కేసులో ఓ ఐఎఎస్ అధికారి సహా ముగ్గురిని ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అరెస్ట్ చేసింది.
09:42 AM (IST) Oct 13
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు మరో రెండ్రోజులు ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కర్ణాటక నుంచి విదర్భ మీదుగా బలహీనపడ్డ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు... పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. ఈ రెండ్రోజులు తెలుగు ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.
09:31 AM (IST) Oct 13
కెనడాలో స్థిరపడిన ఏలూరు జిల్లా నూజివీడు టెకీ సరదాగా విహారయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి అమెరికా వెళ్లిన నెక్కలపు హరీష్ చౌదరి (35) ఓ అందమైన జలపాతం వద్ద ఫోటో తీసుకుంటుండగా కాలుజారి ఉదృతంగా ప్రవహిస్తున్న నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.