Published : Sep 01, 2022, 09:26 AM ISTUpdated : Sep 01, 2022, 10:01 PM IST

నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

09:09 PM (IST) Sep 01

సినిమా థియేటర్‌పై పవన్ ఫ్యాన్స్ దాడి

కర్నూలులోని శ్రీరామ థియేటర్‌పై పవన్ కల్యాణ్ అభిమానులు దాడి చేశారు. సౌండ్ సిస్టమ్ సరిగా లేదని ఆగ్రహించిన ఫ్యాన్స్.. రాళ్లు రువ్వడంతో థియేటర్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్ధితిని చక్కదిద్దారు. 

08:20 PM (IST) Sep 01

రేపు టీఎస్ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్

రేపు ఉదయం పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఆగస్ట్ 1 నుంచి 10 వరకు నిర్వహించిన పరీక్షలకు దాదాపు 55,662 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 

07:47 PM (IST) Sep 01

ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు సఫలం

ఫేస్ రికగ్నిషన్ యాప్, అటెండెన్స్ వివాదాలపై ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను తమ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఉపాధ్యాయులు అంగీకరించారు. 

06:53 PM (IST) Sep 01

ఇబ్రహీంపట్నం ఘటనపై తమిళిసై ఆరా

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుండాలన్నారు. 

06:13 PM (IST) Sep 01

రాజాసింగ్‌కు మరికొంత సమయం ఇవ్వండి

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని బీజేపీ పెద్దలను కోరారు ఆయన భార్య ఉషాబాయి. ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఘటనపై బీజేపీ హైకమాండ్.. రాజాసింగ్‌కు షోకాజో నోటీసులు ఇచ్చింది. దీనిపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. 

04:58 PM (IST) Sep 01

ఇబ్రహీంపట్నం దుర్ఘటన ఎఫెక్ట్... తెలంగాణలో కు.ని ఆపరేషన్లు నిలిపివేత

ఇబ్రహీంపట్నం దుర్ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిలిపివేసిన ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. రోజుకు కేవలం 15 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేలా కొత్త నిబంధన తీసుకువచ్చారు. 
 

03:57 PM (IST) Sep 01

నేడు భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ(గురువారం) భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 770  పాయింట్ల నష్టంతో 58,766 వద్ద నిప్టీ 217 పాయింట్ల నష్టంతో 17,542 వద్ద ముగిసాయి. 
 

03:07 PM (IST) Sep 01

కేజ్రీవాల్ సర్కార్ సేఫ్... విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్

డిల్లీ అసెంబ్లీలో చేపట్టిన విశ్వాస పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీని చాటుకుంది. ఈ విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా 58 ఓట్లు వచ్చాయి. దీంతో ఆప్ ప్రభుత్వానికి ఎలాంటి దోకా లేదని తేలిపోయింది. 


 

01:23 PM (IST) Sep 01

సెప్టెంబర్ లోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు...

ఈ నెలలో (సెప్టెంబర్) ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైసిపి ప్రభుత్వం సిద్దమవుతోంది. సెప్టెంబర్ 12వ తేదీ నుండి వారంరోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ నెల 7వ తేదీన జరిగే కేబినెట్ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాల సమాచారం. 

01:11 PM (IST) Sep 01

తెలంగాణలో బిజెపి-టిడిపి పొత్తుపై ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం తర్వాత తెలంగాణలో బిజెపి-టిడిపి కలిసి పోటీచేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. టిడిపితో పొత్తు వుండబోదని... తెలంగాణలో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. అయితే ఏపీలో మాత్రం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో కలిసి బిజెపి పోటీ చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేసారు. 


 

11:49 AM (IST) Sep 01

కరోనా నుండి కోలుకున్న బిగ్ బి అమితాబ్

ఇటీవల కరోనాబారిన పడి హోంఐసోలేషన్ లో వున్న బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోలుకున్నారు. తనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లు... ఇక తన పనుల్లో బిజీ అవుతున్నట్లు అమితాబ్ ప్రకటించారు. '' మీ అందరి (అభిమానుల) ప్రార్థనలు, దయవల్ల నేను కరోనా నుండి కోలుకున్నాను. గత రాత్రే నాకు కరోనా నెగెటివ్ గా నిర్దారణ అయ్యింది. కాబట్టి 9 రోజుల ఐసోలేషన్ కు ముగింపు పలికి తిరిగి నా పనుల్లో నిమగ్నమవుతున్నాను'' అంటూ అమితాబ్ తెలిపారు. 
 

11:11 AM (IST) Sep 01

టీమిండియాతో టీ20 సీరిస్, టీ20 వరల్డ్ కప్ ఆడే ఆసిస్ జట్టిదే..

వచ్చే నెల (అక్టోబర్) స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా కసరత్తు ప్రారంభించింది. ఈ మెగా టోర్నీకి ముందు భారత్ తో ఈ నెల(సెప్టెంబర్)లో జరిగే టీ20 సీరీస్ లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది ఆస్ట్రేలియా. ఇలా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు భారత్ తో టీ20 సీరిస్ కు విశ్రాంతినిచ్చింది. ఇలా జట్టులో పలు మార్పులతో టీ20 వరల్డ్ కప్, భారత్ తో టీ20 సీరిస్ కోసం ఆసిస్ జట్టును ప్రకటించారు. 

భారత్ తో టీ20 ఆడే ఆసిస్ జట్టిదే: 

ఆరోన్ పించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), అష్టన్ అగర్, టిబ్  డేవిడ్, హేజిల్ వుడ్, ఇంగ్లిస్, మార్ష్, మాక్స్ వెల్ , రిచర్డ్ సన్, స్టీవ్ స్మిత్, స్టార్క్, స్టోయినీస్, మాథ్యూ వెడ్, కామెరాన్ గ్రీన్

ఇక టీ2‌ వరల్డ్ కప్ లో పైజట్టు నుండి కామెరాన్ గ్రీన్ వైదొలిగి ఆ స్థానంలో డేవిడ్ వార్నర్ జట్టులో చేరనున్నాడు. 
 
 

10:05 AM (IST) Sep 01

కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇంట విషాదం...

కాంగ్రెస్ పార్టి అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం చోటుచేసుకుంది. సోనియా గాంధీ మాతృమూర్తి పోలీ మినో మృతిచెందారు. దీంతో సోనియా తల్లి మరణంపై కాంగ్రెస్ నాయకులతో పాటు అన్నిపార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేసారు. బాధలో వున్న సోనియా కుటుంబానికి నాయకులు సానుభూతి వ్యక్తం చేసారు. 
 

09:34 AM (IST) Sep 01

గుడ్ న్యూస్... తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపనీలు ప్రకటించాయి. సెప్టెంబర్ ప్రారంభంనుండే అంటే ఇవాళ్టి నుండే ఈ తగ్గింపు అమల్లోకి రానుంది. వాణిజ్య సిలిండర్ ధరను రూ.91.50 తగ్గిస్తున్నట్లు కంపనీలు వెల్లడించాయి. అయితే ఇళ్లలో వాడే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

 
 

09:27 AM (IST) Sep 01

జమ్మూ కశ్మీర్ లో ఎన్కౌంటర్... ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. బారాముల్లా జిల్లా సోపారీలో తనిఖీలు చేపడుతున్న బద్రతా బలగాలపై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు దాడి కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులకు దిగి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ కాల్పుల్లో ఓ సాధారణ పౌరుడు కూడా గాయపడ్డాడు.