
Manipur violence: మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హిమాన్షు శేఖర్ దాస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోక్ ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. మణిపూర్ హింసాకాండపై ఏర్పాటైన జ్యుడీషియల్ కమిషన్ తన పనిని ప్రారంభించింది. ఈ కమిటీ తన నివేదికను 6 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుందని సమాచారం. అలాగే.. ఎవరైనా తగిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
మణిపూర్‌లో ఏ పరిస్థితుల్లో హింస చెలరేగింది, పరిస్థితి ఎలా దారుణంగా మారింది అనే అంశాలపై కమిషన్ దర్యాప్తు చేస్తుంది. హింస జరిగినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు లేదా బాధ్యులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారా? లేదా? ఆ సమయంలో వారి పాత్ర ఏమిటి? అనేదానిపై కూడా కమిషన్ దర్యాప్తు చేస్తుంది. ఈ కమిషన్ ప్రధాన కార్యాలయం ఇంఫాల్‌లో ఉంటుంది. అదే సమయంలో ఇంఫాల్-దిమాపూర్ NH-2 హైవేపై ఉన్న అడ్డంకులను తొలగించాలని హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాలపై కమిటీ విచారణ జరుపుతుంది
1. మణిపూర్‌లో వివిధ వర్గాల సభ్యులను లక్ష్యంగా చేసుకుని హింస ఎందుకు జరిగింది
2. సంఘటనల కాలక్రమం, హింసకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకరావడం.
3. ఈ ఘర్షణలకు ఎవరూ బాధ్యులు
4. హింసను నిరోధించడానికి, ఎదుర్కోవడానికి తీసుకున్న పరిపాలనాపరమైన చర్యలేంటీ.
5. విచారణ సమయంలో సంబంధితంగా కనుగొనబడే అన్ని అంశాలన్నీ పరిగణించబడతాయి.
కమిటీలో ఎవరున్నారు?
1. గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లాంబా (అధ్యక్షులు)
2. రిటైర్డ్ IAS హిమాన్షు శేఖర్ దాస్ (సభ్యుడు)
3. రిటైర్డ్ IPS అలోక్ ప్రభాకర్ (సభ్యుడు)
ఈ అంశాలను కూడా కమిటీ విచారణలో చేర్చనున్నారు
ఎ) కమిషన్ ద్వారా నిర్దేశించబడిన అఫిడవిట్‌లతో పాటు ఏదైనా వ్యక్తి లేదా సంఘం ద్వారా కమిషన్ ముందు చేయగలిగే ఫిర్యాదులు లేదా ఆరోపణలు.
బి) ఆర్టికల్ 2(i) (a) నుండి (e)కి సంబంధించిన విషయాలను మణిపూర్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు.
భావోద్వేగానికి లోననై అమిత్ షా
ఆహారం, మందులు, పెట్రోల్/డీజిల్, ఇతర నిత్యావసర వస్తువులు ప్రజలకు చేరేలా ఇంఫాల్-దిమాపూర్ NH-2 రహదారిపై ఉన్న అడ్డంకులను తొలగించాలని మణిపూర్ ప్రజలకు హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఏకాభిప్రాయానికి వచ్చేందుకు పౌర సంఘాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా తాను అభ్యర్థిస్తున్నానని ఆయన అన్నారు. మనమందరం కలిసి ఈ ఘర్షణ స్థితి నుంచి సాధారణ స్థితిని తీసుకరాగలమని అన్నారు.
హోం మంత్రి విజ్ఞప్తికి COTU ప్రతిస్పందన
ఇంఫాల్-దిమాపూర్‌ను కలిపే NH2పై ఉన్న దిగ్బంధనాన్ని తొలగించాలని హోం మంత్రి అమిత్ షా చేసిన విజ్ఞప్తిపై ట్రైబల్ ఇంటిగ్రేషన్ కమిటీ/COTU ప్రతిస్పందన వచ్చింది. జూన్ 5 నుంచి 7 రోజుల పాటు దిగ్బంధనాన్ని నిలిపివేస్తామని చెప్పారు. ఈ సమయంలో దాడి జరిగితే ఆ విషయంపై పునరాలోచన చేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిత్యావసర సరుకులను తరలించేందుకు వీలు కల్పించింది.