Bikaner: బికనీర్ లో మూడున్నరేళ్ల కిండర్ గార్టెన్ విద్యార్థినిపై స్కూల్ బస్సు కండక్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన తల్లిదండ్రులు చనిపోతారనీ, ఒంటరిగా వదిలేస్తారని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడు మదన్ లాల్ (34)ను అరెస్టు చేశారు. మదన్ లాల్ చిన్నారిపై దాడి చేసిన సమయంలో డ్రైవర్ కమల్, మహిళా బస్సు సహాయకురాలు పూజ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Rajasthan: ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడున్నరేళ్ల చిన్నారిపై స్కూల్ బస్సు కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఈ దారుణ రాజస్థాన్ లో చోటుచేసుకుంది. బికనీర్ లో మూడున్నరేళ్ల కిండర్ గార్టెన్ విద్యార్థినిపై స్కూల్ బస్సు కండక్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన తల్లిదండ్రులు చనిపోతారని, ఒంటరిగా వదిలేస్తారని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడు మదన్ లాల్ (34)ను అరెస్టు చేశారు. మదన్ లాల్ చిన్నారిపై దాడి చేసిన సమయంలో డ్రైవర్ కమల్, మహిళా బస్సు సహాయకురాలు పూజ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బికనీర్ లో మూడున్నరేళ్ల కిండర్ గార్టెన్ విద్యార్థినిపై స్కూల్ బస్సు కండక్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు. అక్టోబర్ 13న చిన్నారికి స్నానం చేస్తుండగా ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో వాపు రావడాన్ని తల్లి గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను ప్రశ్నించగా కండక్టర్ చేసిన దారుణ పని, అతని బెదిరింపులు బయటపడ్డాయి. దీంతో తల్లి చిన్నారి తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో తీసి పోలీసులకు ఇవ్వడంతో శనివారం మదన్ లాల్ ను అరెస్టు చేశారు.
అయితే, తనపై లైంగికదాడి గురించి చిన్నారి తన టీచర్ కు కూడా చెప్పిందనీ, అయితే, వారు తనను తిట్టారని, మౌనంగా ఉండమని, భోజనం ముగించాలని చెప్పారని తల్లి ఫిర్యాదులో పేర్కొంది. తల్లి ఫిర్యాదు ప్రకారం, మదన్ లాల్ పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించినప్పటి నుండి చిన్నారితో పరిచయం కలిగి ఉన్నాడు. ఆమె మునుపటి పాఠశాలలో బస్సు డ్రైవర్ గా ఉన్నాడు. మదన్ లాల్ తో బాలిక ఉన్న ఫోటో కూడా దొరికిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసుకుని ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.