
UP Election news 2022 : ఉత్తరప్రదేశ్‌లో తన వాహనంపై దాడి చేసిన వారు గాంధీని చంపిన వ్యక్తిలాంటి మనస్తత్వం కలిగిన వారేనని ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) అన్నారు. బుధవారం సంభాల్‌లో ఓ సభలో ఆయన మాట్లాడారు. యూపీలో మాఫియా రాజ్ అంతమైందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Up cm yogi adhityanath) చెబుతుంటే తనపై బుల్లెలు పేల్చింది ఎవరు అని ప్రశ్నించారు. ‘‘వారు గాడ్సే వారసులు. గాంధీని చంపిన వారిలాంటి మనస్తత్వం ఉన్నవారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అగౌరవపరచాలని కోరుకునే వారు. వారు చట్టాన్ని విశ్వసించరు. బ్యాలెట్లను నమ్మరు కానీ బుల్లెట్లను నమ్ముతారు ’’ అని ఒవైసీ అన్నారు.
ఉత్తరప్రదేశ్ (utharpradhesh)లో ఎన్నికల సందర్భంగా సంభాల్ (sambhal)లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం, హోంమంత్రి, ప్రధాని చెప్పినట్లు మాఫియా మొత్తం జైలుకు వెళ్లినట్లయితే తూటాలు పేల్చింది ఎవరని ప్రశ్నించారు.
గత వారం అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన హాపూర్ వెళ్లారు. ప్రచార కార్యక్రమం అనంతరం ఆయన హాపూర్ నుంచి వెళ్లిపోతుండగా టోల్ ప్లాజా (toll plaza) సమీపంలో ఇద్దరు దుండగులు అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారుకు బులెట్లు తగిలాయి. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఎర్రకోట (red fort), కుతుబ్‌మినార్ (kuthubminor) తదితర ప్రదేశాలను తన పూర్వీకులు భారత్‌కు ఇచ్చారని అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ (akbaruddin owaisi) చేసిన ప్రకటనతో తాను ఒవైసీపై కాల్పులు జరిపామని ఓ నిందితుడు తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో ఒవైసీకి జెడ్-కేటగిరీ భద్రత (z category security) కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (central home ministry) నిర్ణయించింది. కానీ దానిని ఒవైసీ తిరస్కరించారు. ఈ విషయంలో పార్లమెంట్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (central home minister amith sha) మాట్లాడారు. ఒవైసీకి ఇంకా ముప్పు ఉందని, ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించాలని కోరారు. కానీ దానికి ఒవైసీ ఒప్పుకోలేదు.తాను స్వేచ్ఛా పక్షిని అని చెప్పారు. సాయుధ కాపలాదారులు తన చుట్టూ ఉండకూడదని ఒవైసీ అన్నారు. తనకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదని తెలిపారు. సామాన్య పౌరుడిలా ఏ కేటగిరీలో వుంటానని.. కాల్పులు జరిపిన వారిని శిక్షించాలని అసదుద్దీన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదే విసయంలో నాలుగు రోజుల క్రితం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనకు న్యాయం చేయాలని కోరారు. తన కారపై జరిగిన కాల్పుల ఘటనపై సరైన విచారణ జరిపించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆయన కోరారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ మీ ప్రభుత్వం క్రికెట్ మ్యాచ్‌పై ఎన్‌ఎస్ఏను ప్రయోగించింది, కాబట్టి ఈ విషయంలో కూడా న్యాయం చేయండి. దీంతో మీరు స్వతంత్రులని యూపీ ప్రజలకు తెలుస్తుంది’’ అని అన్నారు. ఈ రాడికలైజేషన్ ప్రబలితే అది తీవ్రవాదంగా, మతవాదంగా మారుతుందని ఓవైసీ హెచ్చరించారు.