చత్తీస్‌ఘడ్ లో తొలి విడత పోలింగ్: ఆ నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లే కీలకం

By narsimha lode  |  First Published Nov 7, 2023, 11:58 AM IST

చత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీకి ఇవాళ పోలింగ్ జరుగుతుంది.  చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో  ఇవాళ  తొలి విడతలో  20 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.


రాయ్‌పూర్:చత్తీస్‌ఘడ్  రాష్ట్రంలోని  పలు  ప్రాంతాల్లో  తెలుగు రాష్ట్రాల నుండి వలస వెళ్లిన  ఓటర్లు  ఆయా పార్టీల గెలుపు ఓటములపై  ప్రభావం చూపుతున్నారు. 

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని  20 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ తొలి విడతలో  పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో  మొత్తం  90  అసెంబ్లీ స్థానాలున్నాయి. రెండో విడత పోలింగ్  మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరగనున్నాయి. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో  బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రస్తుతం  రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది.  

Latest Videos

undefined

 రాష్ట్రంలోని  బిలాయ్, రాయ్ పూర్,  జగదల్ పూర్ ప్రాంతాల్లో  రెండు తెలుగు రాష్ట్రాల నుండి వలస వెళ్లి స్థిరపడినవారే ఎక్కువగా ఉంటారు.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి  చెందిన  ప్రజలు  ఈ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఉద్యోగం కోసమో, లేదా  ఉపాధి కోసమో  ఈ ప్రాంతాలకు వెళ్లి అక్కడే  నివాసం ఉంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి  ఈ మూడు ప్రాంతాల మధ్య  పెళ్లి సంబంధాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. దీంతో  ఏళ్ల క్రితం చత్తీస్ ఘడ్ కు వెళ్లిన  కుటుంబాలు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాయి.  

ఒక్క జగదల్ పూర్ లోనే  సుమారు  50 వేల మంది వరకు  పలు నియోజకవర్గాల్లో తెలుగు రాష్ట్రాల నుండి వలస వెళ్లిన వారు నివాసం ఉంటున్నారు.   చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో  మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో  ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల వరకే  పోలింగ్ నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  భారీ బందోబస్తు మధ్య  పోలింగ్ నిర్వహిస్తున్నారు. మరో వైపు సుక్మా జిల్లాలో  ఇవాళ  మావోయిస్టులు ఎల్ఈడీని పేల్చారు.ఈ ఘటనలో  ఓ జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి.

click me!