టీనేజ‌ర్లు అద‌ర‌గొట్టారు.. 2 కోట్ల మంది పిల్ల‌ల‌కు మొద‌టి డోసు- ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

By team teluguFirst Published Jan 12, 2022, 5:45 PM IST
Highlights

రెండు కోట్ల మంది టీనేజర్లు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకొని అదరగొట్టారని ప్రధాని మోడీ ప్రశంశారు. పిల్లలు చాలా అద్భుతం చేశారని ట్వీట్ చేశారు. 

క‌రోనా (corona) కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో టీనేజ్ (teenage)  పిల్ల‌ల‌కు కూడా క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో జ‌న‌వ‌రి 3 నుంచి పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌డం ప్రారంభించింది. అయితే శ‌నివారం నాటికి దేశ వ్యాప్తంగా ఉన్న 2 కోట్ల మంది పిల్ల‌ల‌కు మొద‌టి డోసు వ్యాక్సిన్ అందింది. దీనిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (pm narendra modi) హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

రెండు కోట్ల క‌రోనా వ్యాక్సిన్ మొద‌టి డోసును అందుకొని టీనేజ్ పిల్ల‌లు అద‌ర‌గొట్టార‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఇదే స్పూర్తిని కొన‌సాగించాల‌ని కోరారు. ‘‘ నా యువ మిత్రులారా.. మీరు చాలా అద్భుతం చేశారు. ఈ ఊపును కొన‌సాగిందాం. కోవిడ్-19 ప్ర‌తీ ఒక్క‌రం పాటిద్దాం. మీరు ఇప్పటికీ వ్యాక్సిన్ వేసుకోక‌పోతే వెంటే వేయించుకోవాల‌ని కోరుతున్నాను.’’ అంటూ ప్రధాని ట్వీట్ (tweet) చేశారు. టీనేజర్లకు టీకాలు వేయాలనే నిర్ణయం కరోనా మహమ్మారిపై మన పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. అలాగే స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లల గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల ఒత్తిడిని తగ్గిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ విష‌యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా (central minister doctor mansuk mandaveeya) స్పందించారు. ఓ ట్విట్ లో టీనేజ్ పిల్ల‌ల ఉత్సాహాన్ని ప్ర‌శంసించారు. అభినందించారు. 

15 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలకు జనవరి 3వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ (corona vaccine) అందించడం ప్రారంభించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో (vaccination drive) భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు కోట్ల మందికి పైగా పిల్ల‌లు క‌రోనా వ్యాక్సిన్ మొద‌టి డోసును పొందార‌ని తెలిపింది. అయితే దేశ వ్యాప్తంగా శ‌నివారం రోజు 1,41,986 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. దీంతో యాక్టివ్ కేసులు 4,72,169కి చేరుకున్నాయ‌ని ప్ర‌క‌టించింది. 

కోవిడ్ - 19 (covid -19)  కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో టీనేజ్ పిల్ల‌ల‌తో పాటు కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ (front line wariars), 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు కూడా మ‌రో డోసు అధ‌నంగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. కోవిడ్ ముప్పు అధికంగా ఉండే వారికి ఒక డోసు అధ‌నంగా ఇవ్వడం వ‌ల్ల వారు సుర‌క్షితంగా ఉంటార‌ని ప్ర‌భుత్వం భావించింది. అయితే సోమవారం ప్రారంభ‌మైన ఈ ప్రికాష‌న‌రీ డోసు కార్య‌క్ర‌మం మొద‌టి రోజు  విజ‌య‌వంతం అయ్యింది. దేశ వ్యాప్తంగా  9 లక్షల మంది లబ్ధిదారులు ఈ ప్రికాష‌నరీ డోసు వేసుకున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు విడుద‌ల చేసిన డేటాలో వెల్ల‌డించాయి. మొద‌టి రోజు చేప‌ట్టిన వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో  9,84,676 మందికి మూడో డోసు అందింద‌ని తెలిపాయి. వీరిలో 5,19,604 మంది హెల్త్ వ‌ర్క‌ర్స్, 2,01,205 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు,  2,63,867 మంది 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధులు ఉన్నారు. అయితే ఈ ప్రికాష‌న‌రీ డోసు పొందాలంటే రెండో డోసు పూర్తి చేసుకొని 9 నెల‌లు లేదా 39 వారాలు దాటి ఉండాలి. 

click me!