యూ ట్యూబ్ లో చూసి ఆత్మహత్య.. డోర్ కి సూసైడ్ నోట్ అతికించి...

Published : Mar 22, 2021, 04:26 PM IST
యూ ట్యూబ్ లో చూసి ఆత్మహత్య.. డోర్ కి సూసైడ్ నోట్ అతికించి...

సారాంశం

జీవితంపై విరక్తితో ఓ టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికోసం అతను ఎలా చనిపోవాలో యూ ట్యూబ్ లో సెర్చ్ కూడా చేశాడు. ఇప్పటివరకు తానేమీ సాధించలేదని, ఇకపై కూడా ఏమీ సాధించలేనని జీవితంపై విరక్తి చెందిన టేకి యూట్యూబ్ లో చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. 

జీవితంపై విరక్తితో ఓ టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికోసం అతను ఎలా చనిపోవాలో యూ ట్యూబ్ లో సెర్చ్ కూడా చేశాడు. ఇప్పటివరకు తానేమీ సాధించలేదని, ఇకపై కూడా ఏమీ సాధించలేనని జీవితంపై విరక్తి చెందిన టేకి యూట్యూబ్ లో చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. 

కర్ణాటక బీదర్ కు చెందిన అంబటి బెంగుళూరులోని మహాదేవపుర లక్ష్మీ నగర్ లో నివాసం ఉంటున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అతడు అమెజాన్ కంపెనీ లో టీం లీడర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో తాను జీవితంలో ఏమీ సాధించలేదు, ఇకపై సాధించలేనని తరచూ బాధపడేవాడు. 

క్రమంగా డిప్రెషన్ లో పడ్డాడు. దీంతో ఎలా హౌ టు డై అని యూట్యూబ్లో సెర్చ్ చేసి చివరికి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఎన్నుకున్నాడు. ఆన్లైన్లో ప్రయోగాల కోసమని ఆర్డర్ చేసి మరీ తెప్పించుకున్నాడు. ఆ తరువాత ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టుకుని, అందులోకి పైపులు పెట్టుకుని వాయువును పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మూడు రోజుల తర్వాత అతని స్నేహితులు గదికి వచ్చి చూడగా, చనిపోయి కనిపించాడు. వెంటనే స్నేహితులు మహాదేవపుర పోలీస్ స్టేషన్లో విషయం తెలియజేశారు. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో రాశాడు.

జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్నానని, కానీ అవన్నీ నెరవేరలేదని వాపోయాడు. తాను యంత్రంలా మారిపోయానని ఈ జీవితం తనకు నచ్చలేదని సూసైడ్నోట్లో జీవన్ పేర్కొన్నాడు. 

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జీవన్ తాను ఉంటున్న ఇంటి డోర్ కు స్వయంగా రాసిన కాగితం అతికించాడు. తలుపు ఎలా తెరవాలో బొమ్మ గీశాడు. అంతేకాదు తెరిచిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందులో రాశాడు. లోపలికి వచ్చిన తర్వాత కరెంటు స్విచ్ వేయవద్దని వేస్తే వెంటనే మంటలు అంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. కిటికీలు, తలుపులన్నీ తెరవాలని.. గ్యాస్‌ సిలిండర్‌ వాల్వ్‌ మూసివేయాలని సూచించాడు. డోర్‌కు అతికించిన కాగితంలో తన ఫొటోను కూడా అతికించాడు.

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu