ఆర్ధిక ఇబ్బందులు: టెకీ కుటుంబం ఆత్మహత్య

By telugu teamFirst Published Sep 29, 2019, 4:25 PM IST
Highlights

ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఇదే సమయంలో ఆన్ లైన్ ట్రేడింగ్ లోను నష్టాలు రావడంతో పూర్తిగా కుంగిపోయాడు. 

భోపాల్: ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన కారణంగా ఒక టెకీ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ఇండోర్ కు చెందిన అభిషేక్ సక్సేనా(45) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఇదే సమయంలో ఆన్ లైన్ ట్రేడింగ్ లోను నష్టాలు రావడంతో పూర్తిగా కుంగిపోయాడు. 

దీనితో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. భార్య  ప్రీతీ సక్సేనా(42) కావల పిల్లలు అద్విత్(14), అనన్య(14) లతో కలిసి ఇండోర్ లో ఒక రిసార్ట్ లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఆన్ లైన్ లో సోడియం నైట్రేట్ ను ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారు. ముందుగా భార్యా పిల్లకు ఇచ్చి తరువాత తాను కూడా సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రూము తలుపులను బద్దసలుగొట్టి లోనికి ప్రవేశించారు. అప్పటికే విగత జీవులుగా పడిఉన్న వారివద్ద నుండి ల్యాప్ టాప్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం ఆర్ధిక ఇబ్బందులవల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. 

click me!