#GETOUT ట్రెండ్ ... విజయ్ పార్టీ వార్షికోత్సవం వేళ సరికొత్త ప్రచారం

Published : Feb 26, 2025, 11:49 AM IST
#GETOUT ట్రెండ్ ... విజయ్ పార్టీ వార్షికోత్సవం వేళ సరికొత్త ప్రచారం

సారాంశం

తమిళ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం వార్షికోత్సవం మహాబలిపురంలో ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు #GETOUT ను ట్రెండ్ చేస్తున్నారు. 

Tamilaga Vetri Kazhagam Anniversary : తమిళనాడు స్టార్ హీరో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం 2026 అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బుధవారం(ఫిబ్రవరి 26న) ఆ పార్టీ మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. మహాబలిపురం పూంచేరిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ వార్షికోత్సవ వేడుకలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. 

టివికే పార్టీ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఉదయమే ప్రారంభమయ్యాయి. ఆ పాార్టీ అధ్యక్షుడు విజయ్ తో పాటు 3,000 మంది ముఖ్య నాయకులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంది. ఈ వేడుకలకు సెల్‌ఫోన్‌ ను అనుమతించలేదు... వార్షికోత్సవానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఈ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం 6 అంశాలను ప్రస్తావించారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ #GETOUT అనే హ్యాష్‌ట్యాగ్‌ను చేర్చారు. 

అందులో మహిళల భద్రత, సంక్షేమానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక  నియంతృత్వ పాలనను సాగిస్తూ ప్రజా గొంతులను అణిచివేయడం, ఓటు బ్యాంకుల కోసం కులమతాల పేరుతో ప్రజలను విడగొట్టడాన్ని కూడా ఈ పోస్టర్ లో పేర్కొన్నారు. పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆర్బాటాలు చేస్తున్నారని ఆరోపించారు.

నూతన విద్యా విధానం, త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతిజ్ఞ చేద్దామని ఆ పోస్టర్ లో ఉంది, సామాన్యులకు వ్యతిరేకంగా రాజకీయ ఉద్దేశాలతో హింసను ప్రోత్సహించే విధంగా పని చేయకుండా ఉండటం, కొందరి అత్యాశ ఆకలి కోసం జరిగే ప్రణాళికాబద్ధమైన శ్రమ దోపిడీ, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలు టివికే పార్టీ పోస్టర్ లో ఉన్నాయి.  

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు