Tamil Nadu Election 2022: "నూత‌న శ‌కానికి నాంది" .. ప‌లు చోట్ల గట్టి పోటీనిచ్చిన విజయ్ మక్కల్ ఇయక్కం

Published : Feb 22, 2022, 05:55 PM IST
Tamil Nadu Election 2022:  "నూత‌న శ‌కానికి నాంది" ..  ప‌లు చోట్ల గట్టి పోటీనిచ్చిన విజయ్ మక్కల్ ఇయక్కం

సారాంశం

Tamil Nadu Urban Local Body Election 2022: తమిళ రాజ‌కీయాల్లో ఇపుడు మరో పేరు రీసౌండ్ చేస్తోంది.. తమిళనాట ఫ్యూచర్ పొలిటికల్ స్టార్ గా వినిపిస్తున్న పేరు దళపతి విజయ్. త‌మిళ నాట రజనీ తర్వాత అంత‌టి స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్. పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వాల‌ని, ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ సిద్దం కావాలని త‌న అభిమానులు కోరుకుంటున్నారు.  

Tamil Nadu Urban Local Body Election 2022: తమిళనాట చిత్ర సీమ‌కు రాజ‌కీయాలు బాగా క‌లిసి వ‌స్తాయి. ఏ చిత్ర సీమలో లేని విధంగా త‌మిళ చిత్ర సీమ‌లో సినీ నటుల పట్ల ఉన్న అభిమానం ఇక్కడ సొంతం.. నచ్చితే.. త‌మ అభిమాన న‌టుల‌కు గుడులు కట్టేసే ఆరాధిస్తారు.  అందుకే త‌మిళ‌ రాజకీయాల్లో సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారికి పొలిటికల్ సక్సెస్ ఓ రేంజ్ లో ఉంటుంది. తమిళ రాజకీయాలను.. సినీ పరిశ్రమను విడదీసి చూడలేం.. చిత్ర సీమ నుంచే వ‌చ్చిన‌ కరుణానిధి, ఎంజీర్, జయలలిత లు సీఎంగా ఎన్నికై ద‌శాబ్దాల పాటు తమిళ రాజ‌కీయాల్లో చక్రం తిప్పారు.

అదే త‌ర‌హాలో వ‌చ్చిన‌ విజయ్ కాంత్, క‌మ‌ల హాస‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చినా కనీసం ఇంపాక్ట్ చూపలేక పోయారు. పొలిటిక‌ల్ స‌క్సెస్ కాలేక‌పోయారు. ఇక ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన‌ట్టే ఇచ్చి వైదొగారు. అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే తమిళ రాజ‌కీయాల్లో ఇపుడు మరో పేరు రీసౌండ్ చేస్తోంది.. తమిళనాట ఫ్యూచర్ పొలిటికల్ స్టార్ గా వినిపిస్తున్న పేరు దళపతి విజయ్.
 
త‌మిళ నాట రజనీ తర్వాత అంత‌టి స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్. పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి స‌రైనా క్లారిటీ ఇవ్వ‌కున్నా.. విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఓ సేవా సంఘం న‌డిపిస్తున్నారు.  గ‌తేడాది జ‌రిగిన తమిళనాడు పంచాయతీ ఎన్నిక(రూరల్ బాడీ)ల్లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో 170 స్థానాల్లో త‌న‌ అభిమానులు పోటీ చేస్తే 129 మంది విజయం సాధించారు. ఈ ఉత్సాహంతో విజ‌య్ అభిమానులు మరోసారి తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల 2022లో పోటీ చేయడానికి తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం అనే పేరును ఉపయోగించారు.

తమిళనాట దశాబ్దం తర్వాత ఇటీవ‌ల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో  విజయ్ మక్కల్ ఇయక్కం తరపున పోటీ చేసిన అనేక మంది అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించారు. తొలి విజ‌యం.. పుదుక్కోట్టై మున్సిపాలిటీలోని 4వ వార్డులో విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ తరపున బ‌రిలో దిగిన  పర్వేజ్ మహ్మద్ విజయం సాధించారు. పర్వేజ్ విజయం ప్రకటన విడుద‌ల కాగానే.. విజయ్ అభిమానుల్లో ఆనందం వెల్లు విరిచింది. అభిమానులు త‌మ ఆనందాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. 

రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతుండగా, విజయ్ మక్కల్ ఇయక్కం తరపున పోటీ చేసిన అనేక మంది అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించారు, ఇది అభిమానులలో భారీ ఆనందాన్ని నింపింది. పుదుక్కోట్టై మున్సిపాలిటీలోని 4వ వార్డులో విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ తరపున తొలిసారిగా పోటీ చేసిన పర్వేజ్ మహ్మద్ విజయం సాధించారు. పర్వేజ్ విజయం ప్రకటించిన వెంటనే, విజయ్ అభిమానులు   వేడుకలు ప్రారంభించారు.

అలాగే.. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 136వ వార్డులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేను వెనక్కి నెట్టి విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్ రెండో స్థానంలో నిలిచింది.  అధికార డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి చాలా కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీలను గెలుచుకుంది. కోయంబత్తూర్, కరూర్, తిరుపూర్ సహా కార్పొరేషన్లను డీఎంకే కైవసం చేసుకుంది.  ఈ స్థితిలో చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 136వ వార్డులో డీఎంకే అభ్యర్థి నీలవరసి తురైరాజ్ 2,110 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయనకు 7,222 ఓట్లు వచ్చాయి. బలమైన పోటీదారుగా భావించిన అన్నాడీఎంకే అభ్యర్థి లక్ష్మీ గోవిందసామికి కేవలం 1,137 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్ రెండో స్థానంలో నిలిచింది. విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్ తరపున పోటీ చేసిన అభ్య‌ర్తికి  5,112 ఓట్లు వచ్చాయి. మనం తమిళులు నాలుగో స్థానంలో, బీజేపీ ఐదో స్థానంలో, పీపుల్స్ జస్టిస్ సెంటర్ ఆరో స్థానంలో నిలిచాయి. ఈ విజయాన్ని కొత్త శకానికి నాందిగా పేర్కొంటూ.. విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇదే స‌రైన స‌మ‌యం అంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది.  

 విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్ విజేతలు వీరే..

రాణిపేటై జిల్లాలోని వాలాజాబాద్ మునిసిపాలిటీ,  వార్డ్ నెం.3 అభ్య‌ర్థిగా పూల వ్యాపారి మోహన్‌రాజ్ విజ‌యం సాధించారు.  కొమరపాళ్యం మున్సిపాలిటీలో వెల్మురుగన్ వార్డ్ నెం.16 నుంచి మణిమాల సిలంబరాసన్, పొన్నేరి మున్సిపాలిటీ వార్డ్ నెం.5 నుంచి రాజశేఖరన్, దక్షిణ కోడికులం మునిసిపాలిటీ -విరుదునగర్ జిల్లా లో ఇద్దరు అభిమానులు,  తేని జిల్లా అనుమంతన్‌పట్టి మున్సిపాలిటీలో  ప‌లువురు విజ‌య్ అభిమానులు  గెలుపొందారు. 

ఇదిలా ఉంటే.. ఈ ఎన్నిక‌ల్లో DMK కూటమి హవా కొనసాగుతోంది. చెన్నై సహా మొత్తం 21 మున్సిపల్ కార్పొరేషన్‌లలోనూ డీఎంకే కూటమి ఆధిక్యత ప్రదర్శిస్తోంది. అలాగే, Tamil Naduలోని 138 మున్సిపాల్టీలకు గానూ 124 చోట్ల డీఎంకే కూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది. 

మొత్తం 3,843 మున్సిపల్ వార్డులకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. ఇప్పటి వరకూ వెల్లడయిన ఫలితాల్లో DMK 248, AIADMK 79, ఇతరులు 53 చోట్ల గెలుపొందారు. నగర పంచాయతీలకు వస్తే DMK 1,251, AIADMK 354 వార్డులను చేజిక్కించుకున్నాయి. ఫిబ్రవరి 19న తమిళనాడు వ్యాప్తంగా 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాల్టీలు, 490 నగర పంచాయతీలకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ నమోదయ్యింది.

మొత్తం 7604 నగర పంచాయతీ వార్డుల్లో DMK 3681, AIADMK 1040, కాంగ్రెస్ 208, బీజేపీ 108, పీఎంకే 52, ఎండీఎంకే 16, వీసీకే 32, డీఎండీకే 16, ఇతరులు 892 చోట్ల గెలుపొందారు.

 మున్సిపల్ కార్పొరేషన్‌లకు వస్తే DMK 248, AIADMK 38, కాంగ్రెస్ 38, బీజేపీ 3, పీఎంకే 2, ఎండీఎంకే 3, వీసీకే 3, ఇతరులు 24 వార్డులను కైవసం చేసుకుంది

PREV
click me!

Recommended Stories

100 కాదు 132 శాతం లక్ష్యం... యువతకు ఉపాధిలో ఈ ప్రాంతం రికార్డు
మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu