భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని అనుమానం.. పిల్లల కళ్ల ముందే తండ్రి ఏం చేశాడంటే ?

Published : Sep 12, 2023, 11:45 AM IST
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని అనుమానం.. పిల్లల కళ్ల ముందే తండ్రి ఏం చేశాడంటే ?

సారాంశం

భార్యపై అనుమానంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. కన్న బిడ్దలపై ముందే ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వారిద్దరూ భార్యాభర్తలు. పెళ్లయి 12 సంవత్సరాలు దాటింది. ఇద్వారికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తెకు 11 ఏళ్లు. అంతా చక్కగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో భర్తకు భార్య తీరుపై అనుమానం వచ్చింది. ఆమె ఎవరితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించాడు. దీంతో పిల్లల ముందే భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని జఫ్రాబాద్ సాజిద్-నిషా దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కూతురు 11 ఏళ్ల వయస్సు ఉంటుంది. సాజిద్ ఓ మొబైల్ రిపేర్ షాపు నిర్వహించేవాడు. కానీ కొంత కాలం కిందట ఆ వ్యాపారాన్ని మూసివేశాడు. అయితే సాజిద్ కొంత కాలం నుంచి భార్య తీరుపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఎవరితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుకున్నాడు. 

దీంతో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో తన భార్యతో గొడవ పడ్డాడు. ఇది తీవ్ర వాగ్వాదంగా మారింది. దీనిని పిల్లలు గమనించారు. అయినా కూడా సాజిద్ ఆగలేదు. వారిద్దరి ముందే నిషాపై కత్తితో దాడి చేశాడు. 11 ఏళ్ల పెద్ద కూతురు తల్లిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ పెనుగులాటలో ఆమె చేతికి గాయాలయ్యాయి. నిషా మెడ, ఛాతీ, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. 

స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం గురు తేజ్ బహదూర్ హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్య కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

80వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech
ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సిల్స్ | Red Fort Independence Day rehearsal