
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయాన్ని సుప్రీంకోర్టు విచారించనుంది. బిల్కిస్ బానో
కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్షమిస్తూ విడుదల చేయడం
కలకలం రేపింది. బిల్కిస్ బానో కేసు విషాదమైన కేసు. ఇందులో దోషులను విడుదల చేయడం అంటే..
అధికారమే ఆ క్రూరుల వైపు ఉన్నదనే సంకేతాలు వెళుతాయని పలువురు భావిస్తున్నారు. ఈ
నేపథ్యంలోనే గుజరాత్ ప్రభుత్వం ఆ దోషులను విడుదలకు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ
సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించబోతున్నది.
ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టు.. బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన
పిటిషన్‌ను విచారించనుంది. జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బీవీ నాగరత్నలు ఈ కేసును విచారిస్తారు.
ముగ్గురు బెంచుల సారథ్యంలో సీజేఐ ఎన్వీ రమణ ఆగస్టు 25న ఈ కేసులో కీలక నోటీసులు పంపారు.
గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన బిల్కిస్ బానో కేసులోని దోషులు అందరినీ ఒక పార్టీ చేయాలని
సూచించారు.
ఈ కేసులో 11 మంది దోషులకు యావజ్జీవ శిక్ష వేసింది. గుజరాత్ రెమిషన్ పాలసీ ఆధారంగా ఆ
దోషులను విడుదల చేశారు. బిల్కిస్ బానో కేసులో ఓ నిందితుడు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశాడు.
తమను విడుదల చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరాడు. అయితే, అది రాష్ట్ర
ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని మే నెలలో సుప్రీంకోర్టు జడ్జీ రస్తోగీ స్పష్టం చేశారు. సదరు పిటిషనర్
పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని రస్తోగీ ఆదేశించారు. రెండు నెలల్లో
నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
అనంతరం గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేసింది. దీనిపై గుజరాత్
ప్రభుత్వం సంచలన నిర్ణయ తీసుకుంది. బిల్కిస్ బానో కేసులోని దోషులు అందరినీ విడుదల చేసింది.