హైదరాబాద్‌కు చేరిన రష్యా వ్యాక్సిన్: భారత్‌లో పంపిణీ ఎప్పుడంటే..?

By Siva KodatiFirst Published Nov 12, 2020, 2:55 PM IST
Highlights

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ తయారీలో తలమునకలై వుంది. ఎన్నో దేశాల్లో టీకా అభివృద్ధి దశలో వుంది. అయితే అందరికన్నా ముందే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ఔరా అనిపించుకుంది.

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ తయారీలో తలమునకలై వుంది. ఎన్నో దేశాల్లో టీకా అభివృద్ధి దశలో వుంది. అయితే అందరికన్నా ముందే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ఔరా అనిపించుకుంది.

దీనిని తీసుకున్న వారికి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ, పలు దేశాలు కరోనా తీవ్రత దృష్ట్యా రష్యా నుంచి డోసులు దిగుమతి చేసుకుంటున్నాయి. అలాగే మరికొన్ని దేశాలు స్పుత్నిక్‌ విపై ప్రయోగాలు సైతం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో స్పుత్నిక్‌ వి హైదరాబాద్‌కు చేరింది. భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్‌లో రెండు, మూడో విడత క్లినికల్ ట్రయల్స్‌ చేసేందుకు రష్యా ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా భారత్‌లో సుమారు 2వేల మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు.

ఈనెల 15 నుంచి రెడ్డీస్ ల్యాబ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించి... అనంతరం ట్రయల్స్‌ రిజల్ట్‌ను డీజీసీఐకి సమర్పించనున్నారు. కాగా.. స్పుత్నిక్‌ టీమ్‌ వ్యాక్సిన్‌ ఇప్పటికే 92 శాతం సక్సెస్‌ సాధించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

2020 సెప్టెంబరులో, డాక్టర్ రెడ్డీస్, ఆర్‌ఈఐఎఫ్ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ని భారతదేశంలో పంపిణీ చేసేందుకు ఒక ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి  తెలిసిందే. ఇందులో భాగంగా, భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది.

మొదట భారత్ లో 3వ దశ ట్రయల్ మాత్రమే నిర్వహించాలని అనుకున్నా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్కో) నిపుణుల కమిటీ (ఎస్ఇసి) ఆదేశాల మేరకు వరుసగా 2,3 దశల క్లినికల్ ట్రయల్ నిర్వహిచనుంది.

1500 మందితో అడాప్టివ్ ఫేజ్ 2,3 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు సన్నద్ధమవుతున్నామని టీకాను విదేశాలలో మార్కెటింగ్ చేస్తున్న ఆర్‌డిఐఎఫ్ తెలిపింది. 

click me!