Uttarakhand Assembly Election 2022: ఉత్త‌రాఖండ్ సీఎం అభ్య‌ర్థి.. సోనియాదే తుది నిర్ణ‌యం: హ‌రీష్ రావ‌త్

By Mahesh RajamoniFirst Published Jan 19, 2022, 11:46 PM IST
Highlights

Uttarakhand Assembly Election 2022: దేశంలో వ‌చ్చే నెల‌లో జ‌రిగి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌లపిస్తున్నాయి. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ ఎన్నిక‌ల్లో పాగా వేయాల‌ని చూస్తున్న కాంగ్రెస్‌.. ప్ర‌చారం ముమ్మ‌రం చేసింది. అయితే, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణ‌యిస్తార‌ని ఉత్త‌రాఖండ్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత హ‌రీష్ రావ‌త్ అన్నారు. 
 

Uttarakhand Assembly Election 2022: దేశంలో వ‌చ్చే నెల‌లో జ‌రిగి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌లపిస్తున్నాయి. ఎన్నిక‌ల సంఘం అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత ప్ర‌చారం వేగం పెంచాయి రాజ‌కీయ పార్టీలు. దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, మ‌ణిపూర్‌, పంజాబ్ రాష్ట్రాల్లో రాజ‌కీయాలు హీటు పుట్టిస్తున్నాయి. ఉత్త‌రాఖండ్ (Uttarakhand) లోనూ అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు.. ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో (Uttarakhand Assembly Election 2022) జ‌య‌కేత‌నం ఎగురువేయాల‌ని కాంగ్రెస్ ప‌క్కా ప్రణాళిక‌ల‌తో ముందుకు సాగుతోంది. అయితే, అంత‌ర్గ‌తంగా కొన‌సాగుతున్న విభేధాలు పార్టీని వెన‌క్కి లాగుతున్నాయి. అయితే, దీని గురించి ఇప్ప‌టికే ప‌లు మార్లు ఉత్త‌రాఖండ్ (Uttarakhand) సీనియ‌ర్ నేత‌ల‌తో కాంగ్రెస్ అధిష్ఠానం చ‌ర్చించి.. వాటికి ఫుల్‌స్టాప్ పెట్టింది. దీంతో అక్క‌డి నాయ‌కులు క‌లిసిక‌ట్టుగా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే, కాంగ్రెస్ (Congress) ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌ర‌నేదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో దీనిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.

ఇటీవ‌ల కాంగ్రెస్ అధిష్ఠానం ఉత్త‌రాఖండ్ ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌ను ఢిల్లీకి పిలిపించి.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై చ‌ర్చించింది. తాజాగా ఉత్త‌రాఖండ్ కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చార సార‌థి హ‌రీష్ రావ‌త్ (Harish Rawat) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐక్యంగా పోరాడాల్సిన అవ‌స‌ర‌ముంద‌నీ, అధినాయ‌క‌త్వం కూడా ఇదే విధ‌మైన అభిప్రాయం వ్య‌క్తం చేసింద‌ని రావ‌త్ అన్నారు. అలాగే, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) నిర్ణ‌యిస్తార‌ని అన్నారు. ‘‘ఎన్నికలను (Uttarakhand Assembly Election) ఐక్యంగా ఎదుర్కోవాలని పార్టీ అధిష్టానం అభిప్రాయ ప‌డుతోంది. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ఎంపిక చేసే ఆదేశం వచ్చిన తర్వాత మేము ఒక‌రిని ఎంపిక చేసుకుంటాం. అయితే, తుది నిర్ణ‌యం మాత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా జీనే  తీసుకుంటారు. సోనియా (Sonia Gandhi) తీసుకున్న నిర్ణ‌యం పై సీఎం అభ్య‌ర్థితో పాటు అంద‌రూ క‌ట్టుబ‌డి ఉంటాం అని అన్నారు" అని అన్నారు. 

కాగా, గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ అధిష్ఠానంపై హ‌రీష్ రావ‌త్ (Harish Rawat) అసంతృప్తిగా ఉన్నారు. ఈ విష‌యంలో బ‌హిరంగంగానే ప‌లుమార్లు వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే ఈ అసంతృప్తిని చల్లార్చడానికి రావ‌త్ ను ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చార సార‌థిగా నియ‌మించింది కాంగ్రెస్‌. రాష్ట్ర కాంగ్రెస్ అంత‌ర్గ‌త పోరు గురించి ఆయ‌న మాట్లాడుతూ.. "మేము ఈ సవాలును ఐక్యంగా ఎదుర్కొంటున్నాము. మేము సోనియా జీ, రాహుల్ జీ నాయకత్వంలో ఒకటిగా ఉన్నాము" అని అని అన్నారు. అధికార బీజేపీని ఈ ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌రిపిస్తామ‌నీ, అధికార పీఠం ద‌క్కించుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంది కాంగ్రెస్‌. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా స్థానిక స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెట్టింది. నిరుద్యోగం, ద్ర‌వ్యోల్బ‌ణం వంటి స్థానిక అంశాల‌ను లేవ‌నెత్తుతూ.. బీజేపీని ఇర‌కాటంలో ప‌డేలా చేస్తోంది ఉత్త‌రాఖండ్ కాంగ్రెస్‌. హరిద్వార్ ద్వేషపూరిత ప్రసంగం కేసు గురించి మాట్లాడిన హ‌రీష్ రావ‌త్ (Harish Rawat).. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైన వారితో సహా సంబంధిత వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకుంటామని  అన్నారు. "ఈ ప్రసంగాలు హరిద్వార్‌లోని సాధువులు, సంప్రదాయాలను దెబ్బతీశాయి. ఈ వ్యక్తులు దేశానికి అన్యాయం చేసారు. నిందితులపై చర్య తీసుకోని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నాను" అని అన్నారు.

click me!