నదిలో రోజుల వ్యవధిలో కొట్టుకొచ్చిన ఏడు మృతదేహాలు..అంతా ఒకే ఫ్యామిలీ, హత్యా, ఆత్మహత్యా..?

By Siva KodatiFirst Published Jan 25, 2023, 3:32 PM IST
Highlights

మహారాష్ట్రలోని పుణే నగరంలో ఓ నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు కొట్టుకు రావడం కలకలం రేపింది. అయితే వీరిది ఆత్మహత్య కాదని, ఎవరో వీరిని నదిలో పడేసి హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పుణే నగరానికి సమీపంలోని ఓ నదిలో ఒకే కుటుంబానికి ఏడుగురి మృతదేహాలు లభ్యమవ్వడం కలకలం రేపింది. అయితే వీటిని ఒకేసారి కాకుండా ఆరు రోజుల వ్యవధిలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జనవరి 18 నుంచి 22 మధ్యలో ఈ నదిలో నాలుగు మృతదేహాలు కొట్టుకురావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆధారాల కోసం గాలించారు. 

ఇది జరిగిన కొద్దిరోజులుకు నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని దౌండ్ ప్రాంతంలో వున్న భీమా నదిలో గుర్తు తెలియని మృతేదహాలు వున్నట్లుగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో షాకైన పోలీసులు అక్కడికి వెళ్లి మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టానికి పంపగా.. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తేలింది. పోస్ట్‌మార్టం రిపోర్టులో నీట మునిగి వీరంతా మరణించినట్లుగా తేలింది. మృతుల్లో నలుగురు పెద్దలు కాగా, మిగిలిన ముగ్గురు చిన్నారులు. అయితే వీరిది ఆత్మహత్య కాదని, ఎవరో వీరిని నదిలో పడేసి హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

click me!