ఓవైపు ఎస్‌డిపిఐ ఆఫీసులపై దాడులు...మరోవైపు కీలక నేతల అరెస్టులు

Published : Mar 06, 2025, 01:16 PM IST
ఓవైపు ఎస్‌డిపిఐ ఆఫీసులపై దాడులు...మరోవైపు కీలక నేతల అరెస్టులు

సారాంశం

పిఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలు కలిగివున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడి ఎస్డీపిఐ  అధ్యక్షుడు ఫైజీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇవాళ  విచారిస్తున్న క్రమంలో ఆ పార్టీ ఆఫీసులపై ఈడి దాడులు సంచలనంగా మారాయి. 

MK Faizy Arrest : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో ఆర్థిక లావాదేవీల ఆరోపణలతో అరెస్టయిన ఎస్‌డిపిఐ జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీని గురువారం కూడా ఈడి విచారిస్తోంది. గత సోమవారం ఫైజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా విచారణ కోసం ఆరు రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. దీంతో ఆయనను విచారించి పిఎఫ్ఐ తో సంబంధాల గురించి విచారిస్తున్నారు.

విదేశాల నుండి పిఎఫ్ఐకి వచ్చిన డబ్బు గురించి మరిన్ని వివరాలు సేకరించడానికి ఫైజీని విచారణ చేస్తున్నారు. ఎస్‌డిపిఐ ఆర్థిక లావాదేవీలను పిఎఫ్ఐ నియంత్రించిందని ఈడి భావిస్తోంది. ఎస్డీపిఐ కోసం ఎన్నికల నిధిని పాపులర్ ఫ్రంట్ నుండి ఇస్తున్నట్లు ఈడీ తేల్చింది.

ఎస్డీపిఐ అభ్యర్థులను పిఎఫ్ఐ నిర్ణయిస్తుంది... వీళ్ళు లోపల ఇస్లామిక్ కార్యకలాపాలు చేపడుతూ బయటకు సామాజిక ఉద్యమంగా పనిచేస్తున్నారని ఈడి తెలిపింది. తనిఖీల్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు పిఎఫ్ఐ ఈ ఎస్డీపిఐకి ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు ఈడి తెలిపింది. గల్ఫ్ నుండి కూడా చట్టవిరుద్ధంగా డబ్బు వచ్చిందని... దేశంలో దాడులు, ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికి గ రంజాన్ కలెక్షన్ పేరుతో డబ్బు వసూలు చేశారని ఈడీ ఆరోపిస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం