మోసపోయిన టెక్కీ.... నెయిల్ పాలిష్ ఖరీదు రూ.92వేలా..?

By telugu news teamFirst Published Feb 17, 2020, 12:56 PM IST
Highlights

తాను ఆర్డర్ చేసిన నెయిల్ పాలిష్ రాలేదంటూ ఫిర్యాదు  చేసింది. వెంటనే స్పందించిన సదరు వెబ్ సైట్ కస్టమర్ కేర్ కి చెందిన వ్యక్తి తమకు ఎలాంటి పేమెంట్ కాలేదని చెప్పారు. ఆ వెంటనే... డబ్బు మీకు వెనక్కి పంపిస్తామంటూ సదరు టెక్కీ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.

ఓ మహిళా టెక్కీ.... ఆన్ లైన్ లో నెయిల్ పాలిష్ కొనుగోలు చేసింది. ఆమె కొనుగోలు చేసిన నెయిల్ పాలిష్... ఇంటికి చేరకపోగా... ఆమె బ్యాంక్ ఖాతాలోని రూ.92వేల పై చిలుకు నగదు.. స్వాహా అయ్యాయి. దీంతో మోసపోయినని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పూణేకి చెందిన మహిళా టెక్కీ(25) గతేడాది డిసెంబర్ 17వ తేదీన ఓ వెబ్ సైట్ లో నెయిల్ పాలిష్ కొనుగోలు చేయాలని అనుకుంది. దాని   ఖరీదు ఆ వెబ్ సైట్ లో రూ.388 ఉండటంతో.. వెంటను కోనుగోలు  చేసింది. అయితే... అనుకున్న టైంకి అది డెలివర్ కాలేదు. దీంతో... ఆమె వెంటనే సదరు వెబ్ సైట్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసింది.

Also Read కదులుతున్న రైలు ఎక్కబోయి.. ట్రాక్ మధ్యలో పడిన మహిళ.. వీడియో.

తాను ఆర్డర్ చేసిన నెయిల్ పాలిష్ రాలేదంటూ ఫిర్యాదు  చేసింది. వెంటనే స్పందించిన సదరు వెబ్ సైట్ కస్టమర్ కేర్ కి చెందిన వ్యక్తి తమకు ఎలాంటి పేమెంట్ కాలేదని చెప్పారు. ఆ వెంటనే... డబ్బు మీకు వెనక్కి పంపిస్తామంటూ సదరు టెక్కీ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అలా తీసుకున్న కాసేపటికే  సదరు మహిళా టెక్కీ ఎకౌంట్ నుంచి రూ.1500 నగదు డెబిట్ అయ్యాయి.

ఆ తర్వాత మహిళా టెక్కీ ఎకౌంట్ నుంచి దాదాపు రూ.92,466 నగదు  కొద్ది కొద్దిగా డెబిట్ అయ్యాయి. దీంతో కంగారు పడిన యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే.. తాను తన బ్యాంక్ ఎకౌంట్ వివరాలనుఎవరికీ చెప్పలేదని సదరు మహిళ చెబుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. 

click me!