ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

By Nagaraju TFirst Published Jan 12, 2019, 7:13 PM IST
Highlights

అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఇప్పటికే ఈబీసీ రిజర్వేషన్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. అటు రాజ్యసభలో సైతం ఈబీసీ  రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. 

ఢిల్లీ: అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఇప్పటికే ఈబీసీ రిజర్వేషన్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. అటు రాజ్యసభలో సైతం ఈబీసీ  రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. 

ఉభయ సభల ఆమోదంతో ఆ బిల్లును భారత రాష్ట్రపతి వద్దకు పంపించారు. దీంతో శనివారం ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించినట్లు అయ్యింది. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసమే ఈ బిల్లు రూపొందించినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 

విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అందుతాయని, ‘‘సబ్‌కా సాథ్...సబ్‌కా వికాస్’’ నినాదం పరిపూర్ణం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు బీజేపీ చెప్పుకొచ్చింది. మంచి ఉద్దేశ్యంతో ఈబీసీ రిజర్వేషన్ల చట్టం చేస్తున్నామని బీజేపీ స్పష్టం చేసింది. 

అగ్రకులాల్లోనూ పేదరికంలో మగ్గుతున్న వారు ఉన్నారని ఆఖరికి చదువుకోవాలన్నా, వాళ్లు బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారంటూ బీజేపీ బిల్లును సమర్థించుకుంది. పేద-గొప్ప అనే తారతమ్యం లేకుండా, సామాజిక సమానత్వం కోసమే ఈబీసీ రిజర్వేషన్లకు రూపకల్పన చేసినట్లు వెల్లడించింది. 

మెుత్తానికి రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ బిల్లు చట్టబద్దత కల్పించడం జరిగింది. సంక్రాంతి పండుగక ముందే ఈబీసీ వర్గాల వారికి ఇది ఒక గిఫ్ట్ అని కేంద్రం స్పష్టం చేసింది.  

 
 

click me!