బెంగళూరులో ఏపీ ఐటీ ఉద్యోగినిపై అత్యాచారం..!

Published : Sep 04, 2021, 07:44 AM ISTUpdated : Sep 04, 2021, 09:41 AM IST
బెంగళూరులో ఏపీ ఐటీ ఉద్యోగినిపై అత్యాచారం..!

సారాంశం

బాధితురాలి వివరాలు మాత్రం పోలీసులు బయటపెట్టలేదు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ రెండు రోజుల కిందట ఫిర్యాదు అందిందని,.. శుక్రవారం ఆ కేసులో అబుజి ఉబాకా, టోనీలను నిందితులుగా  గుర్తించామని దర్యాప్తు అధికారులు వివరించారు.


 ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు నైజీరియన్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ ఆరోపించగా..  నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని  బాణసవాడ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. బాధితురాలి వివరాలు మాత్రం పోలీసులు బయటపెట్టలేదు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ రెండు రోజుల కిందట ఫిర్యాదు అందిందని,.. శుక్రవారం ఆ కేసులో అబుజి ఉబాకా, టోనీలను నిందితులుగా  గుర్తించామని దర్యాప్తు అధికారులు వివరించారు. తనపై అత్యాచారం జరిగిందని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. నైజీరియా రాయబార కార్యాలయానికి అరెస్టు సమాచారాన్ని పంపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport