భార్యను హత్య చేసిన భర్తను పట్టిస్తే 70 లక్షలు: పోలీసులు

By telugu teamFirst Published Oct 20, 2019, 2:03 PM IST
Highlights

భార్యతోపాటు కలిసి ఈ సదరు భద్రేశ్ కుమార్ పటేల్ స్టోర్ లో నైట్ డ్యూటీ లో ఉన్నాడు. భార్యతోపాటు కిచెన్ లోపలి వెళ్ళాడు కానీ ఒక్కడు మాత్రమే బయటకు వచ్చాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ నివాసముండే ఇంటికి వెళ్లి కొన్ని వస్తువులు తీసుకొని సమీప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి  నుండి భారత్ కు పారిపోయాడు. 

అక్షరాలా 70 లక్షల రూపాయలు కావాలా? అయితే వెంటనే భద్రేశ్ కుమార్ పటేల్ అనే వ్యక్తి ఆచూకీని మాకు చెప్పండంటూ అమెరికా కు చెందిన ఫెడరల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. 

వివరాల్లోకి వెళితే, భద్రేశ్ కుమార్ పటేల్ అనే వ్యక్తి  అహ్మదాబాద్ నగర వాస్తవ్యుడు. జీవితంలో కలలు సాకారం చేసుకోవడానికి అమెరికాకు వెళ్ళాడు. ఇతని భార్య పేరు పాలక్. వీరిరువురు అమెరికాలో డన్కిన్ డోనట్ బేకరీలో పనిచేస్తున్నాడు. 2015 ఏప్రిల్ లో పాలక్ వీరు పనిచేసే స్టోర్ లోని కిచెన్ లో విగత జీవిగా పడిఉంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తునారంభించారు. 

దర్యాప్తును ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. 2015 ఏప్రిల్ లో భార్యతోపాటు కలిసి ఈ సదరు భద్రేశ్ కుమార్ పటేల్ స్టోర్ లో నైట్ డ్యూటీ లో ఉన్నాడు. భార్యతోపాటు కిచెన్ లోపలి వెళ్ళాడు కానీ ఒక్కడు మాత్రమే బయటకు వచ్చాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ నివాసముండే ఇంటికి వెళ్లి కొన్ని వస్తువులు తీసుకొని సమీప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి  నుండి భారత్ కు పారిపోయాడు. 

2015 నుండి పోలీసులు వెతుకుతున్నా ఇతను మాత్రం దొరకడంలేదు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ముఖ్యమైన 10మంది నేరస్థుల్లో ఈ భద్రేశ్ కుమార్ కూడా ఒక్కడిని పోలీసులు పేర్కొంటున్నారు. ఇతగాడి కోసం పోలీసులు అమెరికాలో, భారత్ లో తీవ్రంగా గాలించారు. కానీ వారి దేవులాటంతా వృధాప్రయాసే అయ్యింది. 

ఇక మేము ఒక్కరమే వెతికితే లాభం లేదని భావించిన అమెరికా పోలీసులు ఇతగాడిపై లక్ష డాలర్ల భారీ నజరానా ప్రకటించారు. చూడాలి ఇకనైనా ఆ సదరు నేరస్థుడు దొరుకుతాడేమో!

click me!