నర్సు పై సామూహిక అత్యాచారం, హత్య..?... ఉద్యోగంలో చేరిన తొలిరోజే ఉరికి వేలాడుతూ.. దారుణం....

Published : May 02, 2022, 08:32 AM IST
నర్సు పై సామూహిక అత్యాచారం, హత్య..?... ఉద్యోగంలో చేరిన తొలిరోజే ఉరికి వేలాడుతూ.. దారుణం....

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఉద్యోగంలో చేరిన తొలిరోజే ఓ నర్సు ప్రాణాలు కోల్పోయింది. ఆమె మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.   

ఉత్తరప్రదేశ్ : కొత్త జీవితం పై ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరింది. అయితే తొలిరోజే ఓ nurse కు నూరేళ్లు నిండాయి. ఆస్పత్రి ఆవరణలోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెపై సమూహిక అత్యాచారం జరిపి, హత్య చేశారని కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. Uttar Pradesh రాష్ట్రంలోని ఉన్నావు జిల్లాలో దారుణం జరిగింది. అయితే, పోలీసులు మాత్రం పోస్టుమార్టమ్ నివేదికల ప్రకారం molesatation జరగలేదని చెబుతున్నారు. బాంగర్ మవూ ప్రాంతంలోని న్యూ జీవన్  ఆస్పత్రిలో శుక్రవారమే ఆమె నర్సుగా చేరింది. తొలి రోజే నైట్ డ్యూటీ చేయాల్సివచ్చింది. శనివారం ఉదయం కల్లా ఆస్పత్రి ఆవరణలో ఆమె ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రి వర్గాలు, పోలీసులకు, మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాయి. ఈ దారుణం వెనక ఆస్పత్రి మేనేజర్ ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, తాగి వచ్చిన మైకంలో భార్యతో గొడవ పడ్డ వ్యక్తి.. ఆమె మీద కోపంతో గొడ్డలి ఎత్తాడు. ఆమె ప్రాణభయంతో పారిపోవడంతో ఆవేశంతో ఊగిపోయాడు. liquor మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తిరిగి ఇంటికి చేరుకున్నాడు.  ఇంట్లో కళ్ళముందు ముగ్గురు చిన్నారులు కనిపించారు.  ఆవేశంతో ఊగిపోతున్న తండ్రిని చూసి బిక్కుబిక్కు మనడం తప్ప మరేమీ తెలియని 5 ఏళ్ల కుమార్తె,  తండ్రిని గుర్తు పట్టడం తప్ప పరిస్థితి అర్థం చేసుకోలేని రెండేళ్ల కుమారుడు.. తల్లి దగ్గర లేకపోవడంతో పాల కోసం ఏడుస్తున్న ఆరు నెలల చిన్నారి.

ఆ స్థితిలో ఆ పసి వాళ్ళని చూసైనా ఆ కర్కశుడి మనసు కరగలేదు. కానీ, మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో మర్చిపోయి… తన సొంత పిల్లలని కూడా చూడకుండా గొడ్డలికి పని చెప్పాడు. ముగ్గుర్ని తెగనరికి… ఆ తర్వాత ఓ బావిలో పడేశాడు. ఈ దారుణం odishaలో చోటు చేసుకుంది. సుందర్ గఢ్ జిల్లా కొయిడా జిల్లా కులా గ్రామానికి చెందిన పండు ముండా శనివారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవపడి గొడ్డలితో ఆమెను వెంబడించాడు. ప్రాణ భయంతో ఆమె దాక్కోవడంతో ఇంటికి వచ్చి అభం, శుభం తెలియని తన ముగ్గురు పిల్లల్ని సీమ(5), రాజు (2),  ఆరు నెలల చిన్నారిని  గొడ్డలితో నరికి చంపాడు.  

ఆ తర్వాత  deadbodyలను బావిలో పడేసి స్థానికంగా ఉండే అడవిలోకి పారిపోయాడు. ఆదివారం ఉదయం తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి వారు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. చివరికి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.  కొన్ని గంటల వ్యవధిలో ఈ దారుణానికి పాల్పడిన పండు ముండాను అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu