గుడ్‌న్యూస్: తగ్గిన వంట గ్యాస్ ధర

Published : Dec 31, 2018, 08:55 PM IST
గుడ్‌న్యూస్: తగ్గిన వంట గ్యాస్ ధర

సారాంశం

ఎల్పీజీ  సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్  ప్రకటించింది


న్యూఢిల్లీ: ఎల్పీజీ  సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్  ప్రకటించింది. నెల రోజుల వ్యవధిలో వంట గ్యాస్ ధర తగ్గడం ఇది రెండోసారి. తగ్గించిన వంట గ్యాస్  ధర సోమవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి రానుంది.

డిసెంబర్ 1వ తేదీన సబ్సిడీతో కూడిన వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.6.52 తగ్గించారు. జూన్ నుండి ఆరుసార్లు  వరుసగా ఆరు దఫాలు పెరిగింది కానీ, ఈ నెలలో వరుసగా రెండోసారి గ్యాస్ ధర తగ్గింది. నూతన సంవత్సరం కానుకగా సబ్సీడీ సిలిండర్ ధర తగ్గింది.

సబ్సీడీయేతర సిలిండర్ ధరను ఏకంగా రూ. 120.50 తగ్గించినట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది.  
 

PREV
click me!

Recommended Stories

Supreme Court: దానిని అత్యాచారంగా పరిగణించలేం.. సుప్రీం సంచలన వ్యాఖ్య‌లు
Good Governance : రాజకీయ ఆందోళనలు యువత భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తున్నాయి?