మాజీ మంత్రి శరద్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ

Published : Jan 13, 2023, 12:07 PM IST
మాజీ మంత్రి శరద్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ

సారాంశం

New Delhi: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ గురువారం కన్నుమూశారు. ఆయన మృతి గురించి కుమార్తె  సుభాషిణి శరద్ యాదవ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ధృవీకరించారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడైన‌ శరద్ యాదవ్ గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో మరణించారు.  

Congress leader Rahul Gandhi: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ గురువారం కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడైన‌ శరద్ యాదవ్ గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో మరణించారు. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడ మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్‌కు నివాళులర్పించారు. ప్రముఖ రాజకీయవేత్త యాద‌వ్ నుంచి తాను రాజకీయాల గురించి చాలా నేర్చుకున్నట్లు ఆయ‌న చెప్పారు.

75 ఏళ్ల శ‌ర‌ద్ యాదవ్ గురుగ్రామ్‌లోని ఒక ప్ర‌యివేటు ఆసుపత్రిలో గురువారం మరణించారు. ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ధృవీకరించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రముఖ సోషలిస్ట్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయ‌న  చాలా కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకునేవారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్రాణాలు కోల్పోయారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడైన శ‌ర‌ద్ యాద‌వ్ కు ఆయ‌న నివాసంలో రాహుల్ గాంధీ నివాళులర్పించారు. శ‌ర‌ద్ యాద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ క్ర‌మంలోనే రాహుల్ గాంధీ మాట్లాడుతూ, శ‌ర‌ద్ యాద‌వ్ తో ఉన్న అనుబంధం గురించి వివ‌రించారు. యాదవ్ ప్రతిపక్ష నాయకుడని, తన అమ్మమ్మ ఇందిరాగాంధీతో రాజకీయ పోరాటం చేశారని, అయితే వారిద్దరూ గౌరవం-ఆప్యాయతతో కూడిన సంబంధాన్ని పంచుకున్నారని ఆయన అన్నారు.

 

శ‌ర‌ద్ యాదవ్ ఎప్పుడూ ఇతరుల గౌరవాన్ని కోల్పోలేదనీ, ఇది రాజకీయాల్లో పెద్ద విషయమని రాహుల్ గాంధీ అన్నారు. "శరద్ యాదవ్ జీ సోషలిజం నాయకుడిగా ఉండటంతో పాటు వినయ స్వభావం గల వ్యక్తి. నేను అతని నుండి చాలా నేర్చుకున్నాను. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేశానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్రలో ఉన్న  రాహుల్ గాంధీ, శుక్రవారం యాత్రకు విరామం ఉన్న నేప‌థ్యంలో పంజాబ్ నుండి ఢిల్లీకి వచ్చారు. 
 

 

ఇదిలావుండగా, శరద్ యాదవ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన మరణం చాలా బాధాకరం అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. తన సుదీర్ఘ ప్రజా జీవితంలో పార్లమెంటేరియన్‌గా, మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్