దుర్మార్గం : కన్న కూతురిపై ఐదేళ్లుగా అత్యాచారం.. అంతం చేసిన అత్తింటివాళ్లు...

Published : Jan 19, 2021, 02:39 PM ISTUpdated : Jan 19, 2021, 03:03 PM IST
దుర్మార్గం : కన్న కూతురిపై ఐదేళ్లుగా అత్యాచారం.. అంతం చేసిన అత్తింటివాళ్లు...

సారాంశం

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రులే కూతుర్ల పాలిట యముళ్లుగా మారుతున్న ఘటనలు ఇటీవల చాలా వెలుగులోకి వస్తున్నాయి. కన్న కూతుర్ని కాటేసిన సంఘటన హరియాణాలో ఇటీవల చోటు చేసుకుంది. ఇలాంటిదే మరో ఘటన మహారాష్ట్రలో జరిగింది. 

కాగా, తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటనలో ఆ కిరాతక తండ్రిని యువతి అత్తింటివారే అంతం చేయడం గమనార్హం. నాగ్ పూర్ లోని హడ్కేశ్వర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

55 యేళ్ల ఓ వ్యక్తి మానసిక స్థితి సరిగాలేని తన కుమార్తెపై గత ఐదు సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఈ సంగతి ఆమె అత్తవారింట్లో ఇటీవల తెలిసింది. దీంతో వారు మండిపడ్డారు. 

ఈ నేపథ్యంలో ఆ యువతి బావ, మరో వ్యక్తి కలిసి ఆ కిరాతక తండ్రిపై దాడి చేసి అంతం చేశారు. కాగా దాడి చేసిన వారిద్దరినీ సోమవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?