నాలుగేళ్ల చిన్నారిపై మహిళా టీచర్ లైంగిక వేధింపులు

Published : Sep 29, 2018, 10:06 AM IST
నాలుగేళ్ల చిన్నారిపై మహిళా టీచర్ లైంగిక వేధింపులు

సారాంశం

దీంతో పోలీసులు రంగంలోకి దిగి పాఠశాలలో సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకొని నిందితురాలైన మహిళా టీచర్ ను అరెస్టు చేశారు.

నాలుగేళ్ల చిన్నారిపై మహిళా టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ టీచర్ ని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయిలోని కండివిలి ప్రాంతంలోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న బాలిక ఎల్కేజీ చదువుతోంది. పాఠశాలలో మహిళా టీచర్ తనను రోజూ తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధిస్తోంది. ఈ విషయాన్ని ఆ చిన్నారి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పాఠశాలలో సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకొని నిందితురాలైన మహిళా టీచర్ ను అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు