'బహిరంగ క్షమాపణ చెప్పాలి': రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ముంబై ప్రెస్ క్లబ్ .. ఇంతకీ ఏం జరిగిందంటే..?

By Rajesh KarampooriFirst Published Mar 25, 2023, 11:58 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్టును బహిరంగంగా అవమానించడాన్ని ముంబై ప్రెస్ క్లబ్ ఖండిస్తోంది

ఇప్పటికే పార్లమెంటు సభ్యునిగా అనర్హతకు గురైన కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. శనివారం ఉదయం రాహుల్ గాంధీ తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ లో అనర్హత వేటుపై కొన్ని అసహ్యకరమైన ప్రశ్నలు అడగడంతో రాహుల్ గాంధీ ఓ జర్నలిస్టుపై అసహనం వ్యక్తం చేశాడు. అతన్ని "బిజెపి కార్యకర్త" అని విరుచుకుపడ్డారు.అయితే.. ఈ ఘటనను ముంబై ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తోంది.

జర్నలిస్టుల పని ప్రశ్నలు అడగడం, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పిలిచి జర్నలిస్టులతో మాట్లాడటం,   జర్నలిస్టుల ప్రశ్నలకు గౌరవంగా, మర్యాదపూర్వకంగా సమాధానం ఇవ్వడం రాజకీయ నేతల కర్తవ్యమని ప్రెస్ క్లబ్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలోని పురాతన రాజకీయ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ.. ఫోర్త్ ఎస్టేట్ గౌరవాన్ని గౌరవించడంలో విఫలమవడం దురదృష్టకరమని ఆ ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పాలని  కోరింది ముంబై ప్రెస్ క్లబ్. జర్నలిస్టులను కించపరిచే పదజాలం, బెదిరింపులతో బుజ్జగిస్తున్న తీరుపై ప్రెస్ క్లబ్ కార్యదర్శి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “విమర్శనాత్మకమైన వ్యాఖ్యలను నివేదించడానికి , అందించడానికి పత్రికా స్వేచ్ఛను సమర్థించాలని మేము రాజకీయ నటులందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. వాక్ స్వాతంత్ర్యం , భావప్రకటనా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని వారు గుర్తుంచుకోవాలి, ”అని ప్రకటన విడుదల చేసింది.  

ఇంతకీ ఏం జరిగిందంటే.. 

పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్ గాంధీ లోక్ సభ ఎంపీగా అనర్హతకు గురయ్యారు.ఈ పరిణామం అనంతరం.. తొలిసారిగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అయితే.. ఈ సమయంలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ సహనం కోల్పోయారు. జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఓబీసీలను అగౌరవపరిచారని బీజేపీ ఆరోపిస్తోందని, అందుకే మీరు దేశ వ్యాప్తంగా మీడియా సమావేశం పెట్టాలని భావిస్తున్నారని, దీనిపై మీరేమంటారు?’’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.

దీనికి రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘భయ్యా దేఖియే.. పెహ్లా ఆప్కా అటెంప్ట్ వహన్ సే ఆయా, దుస్రా ఆప్కా అటెంప్ట్ యహన్ సే ఆయయా, తీస్రా ఆప్కా అటెంప్ట్ యహన్ సే ఆయా. ఆప్ ఇత్నే డైరెక్ట్ లీ బీజేపీ కే లియే క్యు కామ్ కర్ రహే హో? (అన్నా చూడండి.. మొదట మీరు నన్ను అక్కడి నుండి (దిక్కు) ప్రశ్న అడగడానికి ప్రయత్నించారు, రెండో సారి ఇక్కడి నుంచి, మళ్లీ మూడో సారి ఇక్కడి నుంచే.. మీరు నేరుగా బీజేపీ కోసం ఎందుకు పని చేస్తున్నారు. ?) తోడి డిస్క్రేషన్ సే కరో యాడ్ (కొంచెం విచక్షణతో చేయండి). ’’ అని అన్నారు.

మళ్లీ కొంచెం సేపు ఆగి ‘‘దయచేసి మీరు బీజేపీ కోసం పని చేయాలనుకుంటే ఇక్కడ (చాతీ వైపు చేయి చూపిస్తూ) బీజేపీ జెండా గుర్తు తెచ్చి మీ ఛాతీపై పెట్టుకోండి.. అప్పుడు నేను వారికి ఎలా సమాధానం ఇస్తానో అదే విధంగా సమాధానం ఇస్తాను. కానీ ప్రెస్‌మెన్‌గా నటించండి.’’ అని అవమానకరంగా మాట్లాడాడు. దీంతో వివాదం ప్రారంభమైంది.  

click me!