డేటింగ్ యాప్ పరిచయం.. బర్త్ డే అని స్టార్ హోటల్ కి పిలిచి.. అత్యాచారం..

Published : Jul 29, 2021, 04:35 PM IST
డేటింగ్ యాప్ పరిచయం.. బర్త్ డే అని స్టార్ హోటల్ కి పిలిచి.. అత్యాచారం..

సారాంశం

మహారాష్ట్రలో ఓ యువతిని ఆమె పుట్టినరోజు నాడే బర్త్ డే సెలబ్రేట్ చేస్తనని పిలిచి.. స్టార్ హోటల్లో అత్యాచారం చేశాడో నీచుడు. 

ప్రస్తుతం యువతీ యువకుల మధ్య సరికొత్త బంధాలకు డేటింగ్ యాప్ లు వేదిక అవుతున్నాయి. అయితే ఈ యాప్ లలో కొత్త వ్యక్తులతో పరిచయం కావడం.. వారితో స్నేహం దారుణ సంఘటనలకు  దారితీస్తోంది. 

యువతీ యువకులతో పాటు.. గే డేటింగ్ యాప్ లు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆ యాప్‌లను ఉపయోగించుకున్న వారు పలు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ యువతిని ఆమె పుట్టినరోజు నాడే బర్త్ డే సెలబ్రేట్ చేస్తనని పిలిచి.. స్టార్ హోటల్లో అత్యాచారం చేశాడో నీచుడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

ముంబైకి చెందిన ఓ యువతికి డేటింగ్ యాప్ లో ఓ యువకుడు నెల కిందట పరిచయమయ్యాడు. అప్పటినుంచి అతడితో చాటింగ్ కొనసాగుతోంది. సోమవారం జులై (26)వ తేదీన ఆమె పుట్టినరోజు ఉండటంతో అతడు ముంబై లోని అత్యంత ఖరీదైన ప్రాంతం లోని ఓ స్టార్ హోటల్లో బర్త్డే ఏర్పాట్లు చేశాడు. నీ కోసం ఈ ఏర్పాట్లు చేశా... అని చెప్పి ఆమెను హోటల్ ఆహ్వానించాడు. అక్కడకు చేరుకున్న యువతికి అతడు మందు గ్లాస్ ఇచ్చాడు. అది తాగిన  తరువాతనెమ్మదిగా యువతి మత్తులోకి జారుకుంది.

 ఆ తర్వాత అతడు హోటల్ గదిలోకి తీసుకెళ్లి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని గుర్తించి యువతి షాక్ కు గురయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu