కన్నకూతుర్ని చంపి, శవాన్ని బావిలోకి విసిరేసి.. ఓ తల్లికర్కశత్వం... !!

Published : Apr 07, 2021, 03:32 PM IST
కన్నకూతుర్ని చంపి, శవాన్ని బావిలోకి విసిరేసి.. ఓ తల్లికర్కశత్వం...  !!

సారాంశం

ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డంకిగా ఉందని భావించి కన్న కూతురునే చంపిందో కసాయి తల్లి.  

కామంతో కళ్లు మూసుకుపోయి.. వివాహేతర సంబంధాలకు పాల్పడడమే కాకుండా అడ్డుగా ఉన్నవారిని నిర్ధాక్షిణ్యంగా హతమారుస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వారి కోరికల ముందు కట్టుకున్న భర్త, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కన్న పిల్లలు ఎవ్వరూ కనిపించడం లేదు. దారుణాలకు తెగబడుతున్నారు. 

తాజాగా ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డంకిగా ఉందని భావించి కన్న కూతురునే చంపిందో కసాయి తల్లి.  కూతుర్ని చంపి అనంతరం మృతదేహాన్ని బావిలోకి విసిరేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని రాయ్‌బరేలిలో జరిగింది.

రాయబరేలి లోని దాల్మయి కోట్‌వాలీ మండలం సుర్సానా గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ భార్య, కూతురు తో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల హోలీ సందర్భంగా భార్య కూతుర్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది.

పండుగ అనంతరం ఆమె తిరిగి రాలేదు. ఆ తర్వాత అదృశ్యమైంది. ఆమె కోసం గాలిస్తుండగా ఆచూకీ లభించలేదు. ఈ సమయంలో ఆమె గురించి తెలిసిన వారు ఒకరు సమాచారం అందించారు.

 ఆమె తన ప్రియుడితో కలిసి పక్క ఊర్లో ఒక ఇంట్లో ఉంటుందని తెలిసింది. దీంతో భర్త వెంటనే అక్కడికి వెళ్లి భార్యను ఇంటికి తీసుకు వచ్చాడు. అయితే కూతురు విషయం అడగగా ఆమె సమాధానం చెప్పలేదు. కుటుంబసభ్యులు అంతటా గాలించారు. పాప ఆచూకీ లభించలేదు. 

ఈ సమయంలో బావిలో బాలిక మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది.వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయగా అది తప్పిపోయిందని వెతుకుతున్న బాలికదిగా తేలింది. 

దీంతో వివరాలు సేకరించిన పోలీసులు బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తానే బాలికను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు.. తెలియకుండా ఉండేందుకు బావిలో పడేసినట్లు చెప్పింది. దీంతో భర్త, ఆమె కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. వెంటనే ప్రియుడితో పాటు ఆమెను జైలుకు తరలించారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu