చంద్రయాన్2.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

By telugu teamFirst Published Sep 7, 2019, 7:29 AM IST
Highlights

చంద్రయాన్-2 అంశంపై నేడు ఉదయం 8 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి ఘట్టంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ తెగిపోయింది. విజయపుటంచుల్లో సిగ్నల్‌ కట్‌ కావడంతో ధైర్యం, స్థైర్యం కోల్పోవద్దని శాస్త్రవేత్తలందరికి మోదీ తెలిపారు. చంద్రయాన్-2 అంశంపై నేడు ఉదయం 8 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.

ఇదిలా ఉండగా... చంద్రుడికి 2.1కిలో మీటర్ల దూరంలోనే ల్యాండర్ విక్రమ్ నిలిచిపోయింది. ల్యాడర్ విక్రమ్ నుండి సిగ్నల్స్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రక్రియ సజావుగా సాగుతున్న తరుణంలోనే 300 మీటర్ల దూరంలోనే విక్రమ్ ల్యాండర్ నుండి సిగ్నల్స్ నిలిచిపోయాయి.  ఈ విషయంపైనే ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. 

click me!